Bedu Fruit Benefits : ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో మనకు బాడీ పెయిన్స్, మోకాళ్ల నొప్పులు, మరియు తలనొప్పి రావడం కామన్ అయిపోయింది. ఇటువంటి నొప్పులు వచ్చినపుడు మనం సాధారణంగా ఏదో ఒక పెయిన్ కిల్లర్ ను వేసుకోవడం పరిపాటి. కానీ ఇలా ప్రతి నొప్పికి పెయిన్ కిల్లర్ వేసుకోవడం వలన మనకు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. కానీ మనం వేరే ఏం చేయలేని పరిస్థితులు ఉన్నాయి.
అందుకోసమే ఆ విషయం తెలిసినా కూడా మరేం చేయలేక మనం ఆ మందులను మింగుతాం. ఇలా అల్లోపతి మందులు కాకుండా బాడీ పెయిన్స్ వచ్చినపుడు మన ఆయుర్వేదంలో సూచించిన విధంగా చేయాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. కడుపు నొప్ప వస్తే జామిన్, బ్లాక్ సాల్ట్ నీళ్లను తాగడం వల్ ఇట్టే తగ్గిపోతుందని చెబుతున్నారు. అంతే కాకుండా పెయిన్ కిల్లర్స్ వాడే బదులు సహజంగా మనకు లభించే బేడూ ఫ్రూట్ ను వాడాలని సూచిస్తున్నారు.
ఈ బేడు ఫ్రూట్ ని హిమాలయ అత్తి అని కూడా పిలుస్తారు. ఈ పండు వలన మనకు అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మనకు కలిగే నొప్పులను చిటికెలో మాయం చేస్తుంది. దైవభూమి ఉత్తరాఖండ్ లోని కుమావోన్ జిల్లాలో మనకు బేడు పండ్లు చాలా విరివిగా లభిస్తాయి. ఈ బేడు పండ్లు మన శరీరానికి చాలా మంచివని ప్రయోగశాలలో అనేక ప్రయోగాలు చేసిన తర్వాత పరిశోధకులు ఒక నిర్ధారణకు వచ్చారు. సైంటిస్టులు చెప్పిన వివరాల ప్రకారంగా.. అడవి హిమాలయన్ అత్తి నొప్పి నివారిణిగా ఉపయోగపడుతుంది. కేవలం ఇది నొప్పుల కోసమే కాకుండా ఎటువంటి చర్మపు ఇన్ఫెక్షన్లు ఉన్నా కూడా బాగా పని చేస్తుందని పరిశోదనల్లో తేలింది.
బేడు పండ్లతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో చాలామందికి పెద్దగా తెలియకపోవచ్చు. హిమలయ అత్తిగా పిలిచే ఈ పళ్లను ఎలా వినియోగించుకో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వైల్డ్ పళ్లుగా పేరొందిన ఈ బేడు పళ్లతో అనేక రకాల దీర్ఘకాలిక నొప్పులను వెంటనే నివారించుకోవచ్చు. చర్మ సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు బేడు పళ్లను తినడం ద్వారా అనేక అద్భుత ప్రయోజనాలను పొందవచ్చు. ప్రత్యేకంచి శరీర కండరాల నొప్పుల నివారణలో బేడు పళ్లకు మించినది ఏది లేవని చెప్పాలి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అడవుల్లో ఎక్కువగా ఈ బేడు పళ్లు లభిస్తుంటాయి. ఈ పళ్లు విరివిగా దొరకుతుంటాయి. చూడటానికి అచ్చం అత్తి పండు మాదిరిగాా కనిపిస్తుంటాయి. పచ్చిగా ఉన్న సమయంలో పచ్చని రంగులో ఉండి… కొంచెం పండిన తర్వాత ముదురు వంకాయ వర్ణంలోకి మారిపోతుంది. ఈ పళ్లలోని విత్తనాలు కూడా మేడి పండు, బేరి పండ్లలా ఆకర్షణీయంగా ఉంటాయి.
బేడు పళ్లు బాటిల్ మాదిరిగా కనిపిస్తాయి. పైభాగం సన్నగా ఉండి మధ్యభాగం నుంచి కింది భాగం వరకు గుండ్రంగా బల్బు ఆకారంలో కనిపిస్తాయి. ఈ పండ్లను ఎండబెట్టడం ద్వారా కూడా అనేక అనారోగ్య సమస్యలకు వినియోగించుకోవచ్చు. ఎండిన అత్తి పళ్లతో ఔషధంగా కూడా పనిచేస్తుంది. వైల్డ్ పళ్లతో ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే తినకుండా వదిలిపెట్టరంతే…
Read Also : Parijat Flower Benefits : ‘పారిజాతం’ పూలా మజాకా.. ఎన్నో ఔషధ గుణాలు.. అన్ని వ్యాధులకు దీనితో చెక్..!