Parijat Flower Benefits : ఆయుర్వేద శాస్త్రంలో పారిజాతానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇది సాధారణంగా బయట కనిపించదు. ఎవరైనా ప్రత్యేకంగా ఇంట్లో, పెరట్లో పెంచుకుంటే తప్పా.. దీని పుష్పాలు తెల్లగా నాలుగు రేకులతో ఉండి మధ్యలో నారింజ పండు కలర్‌లో ఉంటాయి. ఈ చెట్టు పుష్ఫాలు రాత్రి పూట వికసించగా తెల్లవారితే రాలిపోతుంటాయి. ఈ చెట్టు ఎక్కడ ఉంటే ఆ చుట్టుపక్కల మొత్తం మంచి (Parijat Flower) పరిమళాన్ని వెదజల్లుతుంది. మత్తును తెప్పిస్తాయి. అయితే, దీని ఆకులకు, పుష్ఫాలకు ఎంతో విశిష్ణ గుణాలున్నాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.
పారిజాతం పూలల్లో (Night Blooming Jasmine Flower) ఎన్నో ఔషధ గుణాలున్నాయట. వైద్యంలో దీని మొక్కను, ఆకులను, గింజలు, పూలను ఎక్కువగా వినియోగిస్తారని తెలుస్తోంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కలోని ఔషధ గుణాలు పలు రకాల వ్యాధులను నయం చేయడంలో కీలకపాత్ర పోషిస్తాయని తెలుస్తోంది.
పారిజాతం చెట్టును ‘నైట్ క్వీన్’, ‘నైట్ జాస్మిన్’ అని కూడా పిలుస్తుంటారు. బాగా చిరాకు లేదా తలనొప్పిగా ఉన్నప్పుడు ఈ పుష్పాల వాసన చూస్తే వెంటనే ఉపశమనం కలుగుతుందట. దీని ఆకులు, పువ్వులు, బెరడుతో ఆర్థరైటిస్, పేగు సంబంధిత వ్యాధులు, వైరస్ కారకాలను నివారించవచ్చని తెలుస్తోంది.
పారిజాతం పుష్ఫాలు, ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ సుగుణాలు పుష్కలంగా లభిస్తాయి. ఒళ్లు, కీళ్ల నొప్పులు, దగ్గు, జ్వరం, జలుబు లాంటి వాటికి రెమిడీగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కీళ్ల నొప్పులతో బాధపడేవారికి పారిజాతం సూపర్ మెడిసిన్. దీని ఆకులు, బెరడు, పువ్వులను మిక్స్ చేసి కషాయంగా మార్చుకోవాలి. జలుబు, సైనస్, దగ్గు వంటి సీజనల్ వ్యాధులకు పారిజాతం టీ చాలా ఉపయోగపడుతుంది.
Parijat Flower Benefits : పారిజాతం చెట్టు మీ ఇంట్లో ఉందా?
ఎలా తయారు చేసుకోవాలంటే.. ఒక గ్లాసు నీళ్లలో 2 లేదా 3 ఆకులు, 4 నుంచి 5 పువ్వులు, 2 లేదా 3 తులసి ఆకులను వేసి బాగా మరిగించుకోవాలి. (Parijat Flower Benefits ) తర్వాత వడపోసి చల్లారాక తీసుకోవాలి. అదే విధంగా జ్వరం తగ్గడానికి 3 గ్రాముల బెరడు, 2 గ్రాముల ఆకులు, 2 లేదా 3 తులసి ఆకులను నీటిలో మరిగించి రోజుకు రెండు సార్లు (ఉదయం, సాయంత్రం) తాగాలి. ఈ కషాయం వలన అన్ని నొప్పులతో పాటు అన్ని వ్యాధులు కూడా నయం అవుతాయి.
పారిజాతం పూలలో (parijat flower good for home) అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి. పారిజాత పువ్వు ఒక్కటే కాదు.. పారిజాతం ఆకులు, కాండం, వేర్లు అన్నింటిలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ పారిజాత పువ్వులతో కషాయాన్ని తయారుచేసుకోవచ్చు. పారిజాతం చెట్టు ఆకులతో కూాడా కషాయాన్ని తయారు చేసుకుని అనేక రోగ రుగ్మతలను దూరం చేసుకోవచ్చు. పారిజాతం పువ్వులను ఆయుర్వేదంలో సర్వరోగనివారణిగా చెబతారు. సుగంధ పరిమాళాలను వెదజల్లే ఈ పారిజాతం పువ్వును ఆయుర్వేద ఔషధాల్లో వినియోగించుకోవచ్చు.
ఈ పారిజాత పువ్వులు తెల్లగా మెరిసిపోతుంటాయి. రాత్రి సమయాల్లోనే ఎక్కువగా వికసిస్తుంటాయి. పగటిపూట ఈ (Parijat Flower) పారిజాత పూలను నేలరాలిపోయినప్పుడు వాటిని సేకరించి అవసరమైన విధంగా వినియోగించుకోవచ్చు. పారిజాతం పుష్పాల్లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ వంటి లక్షణాలు అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరం చేయడంలో అద్భుతంగా పనచేస్తాయి.
Read Also : Nall Tumma Babul Uses : నల్ల తుమ్మ చెట్టు బెరడు, పువ్వులు, గమ్‌తో ఎన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయో తెలుసా..!