Sravana Mangala Gowri Vratham : శ్రావణ మంగళవారం రోజున ఆడవాళ్లు మంగళ గౌరీ దేవిని ఏ విధంగా పూజిస్తే.. ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయో తెలుసుకుందాం. శ్రావణ మంగళవారం అంటేనే ఆడవాళ్లకు ఎంతో ప్రీతిపాత్రమైన రోజుగా చెబుతారు. ఆడవాళ్లు శ్రావణ మంగళవారం మంగళ గౌరీ వ్రతాలు చేసుకుంటారు. శ్రావణ మంగళవారం మంగళ గౌరీ దేవికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు పాటిస్తే.. ఇంట్లో సభ్యులందరికీ అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి.
మంగళ గౌరీ వ్రతం చేసుకోలేని ఆడవాళ్ళు ఎవరైనా సరే.. ఆధునిక కాలంలో ఉద్యోగాలపరంగా గాని చదువుల పరంగా గాని ఎక్కువ సేపు పూజ చేసుకోవటం సాధ్యం కావడం లేదు. అలాంటి తరుణంలో మంగళ గౌరీ వ్రతాలు పెట్టుకోవడం, చాలామందికి అలా వీలుపడని ఆడవాళ్లు సైతం మంగళ గౌరీ దేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో తులతూగాలంటే శ్రావణ మంగళవారం ఆడవాళ్లు ఇంట్లో దీపం పెట్టుకొని శక్తివంతమైన శ్లోకం చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని అత్రి మహర్షి భార్య అనసూయ సతీ సావిత్రికి చెప్పింది శ్రీకృష్ణుడు నారద మహర్షికి చెప్పాడు.
చాలా రహస్యమైనటువంటి చాలా శక్తివంతమైన శ్లోకం ఇది. ఆడవాళ్లకు ఎంతో ఇష్టమైన శ్రావణ మంగళవారం మంగళ గౌరీ పూజలు చేయలేని వాళ్ళు మంగళ గౌరీ వ్రతాలు చేసుకోలేని వాళ్ళు ఇంట్లో దీపం పెట్టి ఆ ఒక్క శ్లోకం చదువుకోవాలి. మీరు ఆఫీసులకు వెళ్లిన చదువుకోవటానికి కాలేజీలకు వెళ్లిన మంగళ గౌరీ మీ వెంట రక్షణ ఉంటుంది. మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. ఆ ఇంటి సభ్యులకి సుఖసంతోషాలకు లోటుండదు. ఆ శ్లోకం ఏంటంటే.. ‘మంగళే మంగళాధారే మాంగళ్యే మంగళ ప్రదేశ్ మంగళార్ధం మంగళే మాంగళ్యం దేహి మే సదా’ ఈ ఒక్క శ్లోకం చదువుకోండి.
ఆడవాళ్ళందరూ కూడా తిరుగులేని విధంగా మంగళ గౌరీ దేవి అనుగ్రహానికి పాత్రులకండి. మంగళ గౌరీదేవికి పిండి దీపాలంటే చాలా ఇష్టం. అందుకే ఆడవాళ్లు శ్రావణ మంగళవారం తమలపాకులో పసుపు ముద్ద ఉంచి ఆ పసుపు ముద్దకి 3 చోట్ల బొట్లు పెడితే మంగళగౌరవుతుంది. బియ్యప్పిండి, బెల్లం తురుము కలిపి చలిమిడి దీపాలు తయారుచేసి.. ఆ చలిమిడి దీపాలు వెలిగిస్తే మంగళ గౌరీ దేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి. అలాగే, వయస్సు పెరిగినా పెళ్లి కాక ఆలస్యం అవుతున్నటువంటి కన్యలు ఎవరైనా సరే శ్రావణ మంగళవారం రుబ్బిన గోరింటాకు తమలపాకుల మీద పెట్టి చిన్న పాపకు మీ చేత్తో ఇవ్వండి. మంగళ గౌరీ అనుగ్రహం వల్ల వెంటనే మనసుకు నచ్చిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు.
Sravana Mangala Gowri Vratham : శ్రావణ మంగళ గౌరీ పూజ, పరిహారాలు
శ్రావణమాసంలో వచ్చే అన్ని మంగళవారాలు లేదా మీకు వీలైన మంగళవారాలు ఈ గోరింటాకు పరిహారం పాటించండి. వివాహ సమస్యలన్నీ తొలగిపోతాయి. అలాగే సమస్యను బట్టి గౌరీదేవిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. శ్రావణ మంగళవారం రోజున తమలపాకులపై పసుపు ఉంచి మూడు చోట్ల కుంకుమ బొట్లు పెట్టి గౌరీదేవిగా భావించి ఆ పసుపు ముద్దకి ఎర్రమందార పూలు పెడితే శత్రు భాధలు, కుటుంబ కలహాలు అన్ని తొలగిపోతాయి. శత్రువులు మిత్రులుగా మారిపోతారు. అలాగే, సంపంగి పువ్వు ఇచ్చినట్లయితే దానివల్ల వివాహ దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
గన్నేరు పూవు ఉంచినట్లయితే.. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. జాజిపువ్వు మంగళ గౌరీ దేవి దగ్గర పెట్టే నమస్కారం చేసుకుంటే వాహన ప్రాప్తి యోగం కలుగుతుంది. తొందరగా బండి కొనాలన్నా, కారు కొనాలన్నా, శ్రావణ మంగళవారం తమలపాకుల పసుపు ముద్ద దగ్గర జాజిపూవు పెట్టి నమస్కారం చేసుకోండి. అలాగే, పూలలో ఒక శక్తివంతమైన పువ్వు ఉంటుంది. నల్ల కలువ పువ్వు, అలాగే తెల్ల కలువ పువ్వు ఉంటుంది. కానీ నల్ల కలువ పువ్వు అంటే గౌరీదేవికి విపరీతమైన ఇష్టం. నల్ల కలువ పువ్వులో గౌరీదేవి ఎప్పుడు కూర్చుని ఉంటుందని పురాణాల్లో చెప్పారు.
ఆడవాళ్లు వీలైతే మాత్రం శ్రావణ మంగళవారం ఒక్క నల్ల కలువ పువ్వు ఎలాగైనా సరే తెచ్చుకొని ఇంట్లో తమలపాకుల పసుపు ముద్ద పెట్టి అక్కడ నల్ల కలువ పువ్వు పెట్టండి. శివపార్వతుల ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గర నల్ల కలువ పువ్వు పెట్టండి. అందులో గౌరీదేవి ఎప్పుడు స్థిరంగా కూర్చొని ఉంటుంది. పరమానందంతో మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుంది. గౌరీదేవి అనుగ్రహం వల్ల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిగితే కుటుంబంలో చక్కటి ప్రశాంతత కలుగుతుంది. శ్రావణ మంగళవారం సందర్భంగా ఆడవాళ్లు మంగళ గౌరీదేవిని ఇలా ప్రసన్నం చేసుకోండి అయితే, ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు గౌరీదేవికి సంబంధించిన శ్లోకం ఒకటి చదువుకున్నా గౌరీ కటాక్షం పరిపూర్ణంగా కలుగుతుంది.
Read Also : Vivah Panchami Vratham : పెళ్లి త్వరగా కావాలంటే ‘వివాహ పంచమి’వ్రతం ఆచరించండి.. మీ కష్టాలు తీరినట్టే..?