Vivah Panchami Vratham : చాలా మంది తమకు వివాహం జరగడం లేదని ఎంతో బాధపడుతుంటారు. పెళ్లి త్వరగా అయ్యేందుకు, ఏమైనా దోషాలు ఉంటే తొలగిపోయేందుకు ఎన్నోపూజలు, నోములు, వ్రతాలు చేస్తుంటారు. రాహు, కేతువు పూజలు జరిపిస్తుంటారు. ఇలా చేయడం వలన తమ జాతకంలోని దోషాలు తొలగిపోయి త్వరగా పెళ్లి జరుగుతుందని వారి నమ్మకం. ఎంతో మంది పండితులు కూడా పూజలు చేయాలని సెలవిస్తుంటారు. అయితే, ‘వివాహ పంచమి వ్రతం’ ఆచరిస్తే పెళ్లి కాని వారికి త్వరగా వివాహ గడియలు దగ్గరపడతాయని జోత్యిష్కులు చెబుతున్నారు. ఈ వ్రతం ఎప్పుడు వస్తుంది. ఎలా చేయాలో తెలుసుకుందాం..

మార్గశిర మాసం శుక్ల పక్షంలోని ఐదో రోజున హిందువులు ‘వివాహ పంచమి’ని జరుపుకుంటారు. ఈ రోజున స్వయాన శ్రీరాముడు, సీతకు వివాహం జరిగిందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈరోజున అన్ని ఆలయాల్లో సీతారాముల వివాహమహోత్సవం జరుగుతుందట.. 2021లో డిసెంబర్ 8వ తేదిన ఈ వివాహ పంచమి వచ్చింది. ఈ రోజున పెళ్లి కాని వారు శ్రీరాముడు, సీత మాతకు పూజ చేయాలి. ఉపవాసం ఉండాలి. ఇలా శ్రద్ధగా పూజ చేస్తే త్వరగా పెళ్లికి అడ్డంకులు తొలగిపోతాయని పురాణాల్లో రాసుందట.. మంచి, అనుకూలమైన లైఫ్ పాట్నర్ కూడా దొరురకుందని పండితులు చెబుతున్నారు.
ఈ శుభ గడియలు డిసెంబర్ 7వ తేది రాత్రి 11 గంటలకు ప్రారంభమై 8వ తేదీ రాత్రి 09 గంటల 20నిమిషాలకు ముగుస్తుందట.. పూజ ఎలా చేయాలంటే.. తల స్నానం చేసి సీతారాముల స్మరణ చేస్తూ ఉపవాసం ఉండాలి. ఓ చోట నీళ్లు చల్లి ఎరుపు లేదా పసుపు క్లాత్ పరిచి సీతరాముల విగ్రహాలను ఉంచాలి. శ్రీరామునికి పసుపు వస్త్రాలు, సీతమాతకు ఎరుపు వస్త్రాలు వేయాలి. అక్షింతలు, పూలతో పూజ చేయాలి.వివాహ పంచమి కథ చదువుతూ ‘ఓం జానకీ వల్లభాయై నమః’ అనే మంత్రాన్ని 1, 5, 7 లేదా 11 సార్లు తలుచుకుంటే చాలు..
Read Also : Relationship Problems : వివాహ బంధంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయా? అయితే ఇలా చేయండి..