Remedy For Attract Money : మీ గృహంలో సకల శుభాలు కలగాలంటే అష్టైశ్వర్యాలు పొందాలంటే.. ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీని తొలగించాలంటే మీ ఇంటి సింహద్వారం పైన ప్రత్యేకమైన తోరణం తప్పక ఉండాల్సిందే.. సాధారణంగా చాలామంది పండుగల సందర్భంగా ఇంటి ముందు భాగంలో తోరణాలను కడుతుంటారు. ముఖ్యంగా మామిడాకుల తోరణాన్నే ఎక్కువగా గుమ్మం మీద కడుతుంటారు.
అయితే, ఇంటి ముందు భాగంలో ఈ అద్భుతమైన తోరణాన్ని కట్టడం ద్వారా లక్ష్మిదేవి అనుగ్రహం కలిగి సకల సిరి సంపదలు కలుగుతాయనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. మామిడి తోరణాలను కడితే ఆ తోరణం కొన్ని రోజులకి ఎండిపోతుంది. అలాకాకుండా ఒక శక్తివంతమైనటువంటి తోరణాన్ని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో కట్టడం ద్వారా ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఈ తోరణం ఎప్పటికీ ఎండిపోదు. అలానే ఉంటుంది. మీ ఇంట సిరి సంపదలు కూడా అలానే వస్తూనే ఉంటాయి.
ఇంతకీ ఆ శక్తివంతమైన తోరణం గురించి ఎప్పుడైనా విన్నారా? అదే ధాన్య తోరణం.. ధాన్యపు తోరణం అన్ని కూడా పిలుస్తారు. ఈ ధాన్యపు తోరణాన్ని వడ్లు తీసుకుని ఒక తోరణం లాగా ఏర్పాటు చేయాలి. వడ్లు కొన్ని తీసుకొని ఆ వడ్లన్నీ ఇలా ఏర్పాటు చేసి వడ్ల తోరణాన్ని అల్లుకోవచ్చు. ఈ ధాన్యపు తోరణాన్ని మీ గుమ్మం పైభాగంలో కట్టుకోవాలి. ఈ తోరణం ఎండిపోదు కాబట్టి.. ఎప్పటికీ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. శ్రీ మహాలక్ష్మి దేవి అష్టలక్ష్మిలలో ధాన్య లక్ష్మీ దేవి కూడా ఉంటుంది. మీ గుమ్మం పై భాగంలో ధాన్య తోరణాన్ని ఇలా ఏర్పాటు చేసుకోవడం ద్వారా లక్ష్మీ కటాక్షాన్ని పొందవచ్చు.
Remedy For Attract Money : శ్రీ మహా లక్ష్మి అనుగ్రహం పొందాలంటే..
అలాగే, ఇంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీని తొలగించాలంంటే కూడా ఈ తోరణం అద్భుతంగా పనిచేస్తుంది. మీ గృహంలో వాస్తు దోషాలు తీవ్రతను తగ్గించుకోవాలంటే.. వాస్తు హనుమాన్ విగ్రహాం లేదా చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు. ఈ హనుమాన్ చిత్రపటాన్ని మీ ఇంటి సింహద్వారం పై భాగంలో పెట్టుకోవాలి. వాస్తు హనుమాన్ చిత్రపటం లేదా వాస్తు హనుమాన్ విగ్రహం ఎలా ఉంటుందంటే.. హనుమంతుడు వాస్తు పురుషుడిని కాలితో తొక్కుతున్నట్లుగా ఉంటుంది. ఆ రూపంలో ఆంజనేయస్వామి దర్శనం ఇస్తారు. ఏ ఇంటి సింహద్వారం పైభాగంలో అయితే, వాస్తు హనుమాన్ ఫొటో లేదా విగ్రహంగా ఉంటుందో ఆ ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. ఆ ఇంట్లో ఎలాంటి వ్యతిరేక శక్తులు ఉండవని అంటారు. ఇక, ఆ ఇంటికి సంపదలు అదృష్టం తొందరగా కలుగుతాయని పురాణాల్లో రాసి ఉంది.