SriKrishna Maha Mantra : ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిధిని వాసుదేవ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. వాసుదేవుడు అనే పేరు శ్రీమన్నారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. ఈరోజు గృహంలో కృష్ణుడి అర్చన చేస్తే.. అద్భుత ఫలితాలు కలుగుతాయి. మీ గృహంలో పూజా మందిరంలో పూజా పీఠం మీద శ్రీకృష్ణ పరమాత్మ పటం అంటే.. వేణుగోపాల స్వామి పటం ఏర్పాటు చేసుకోవాలి. ఆ వేణుగోపాల స్వామి చిత్రపటానికి గంధం బొట్లు, కుంకుమ బొట్లు అలంకరించాలి. వేణుగోపాల స్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదల ఆవు నెయ్యి పోసి 6 వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి. సువాసన కలిగినటువంటి పుష్పాలతో గులాబీ పూలతో శ్రీకృష్ణుడి చిత్రపటానికి అర్చన చేస్తూ ‘ఓం వాసుదేవాయ నమః’ అనే నామాన్ని వీలైనంత సార్లు జపించాలి. ఈ నామం చదువుకుంటూ శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటానికి సువాసన కలిగిన పుష్పాలతో గులాబీ పూలతో నీలం రంగు పుష్పాలతో పూజ చేస్తే కృష్ణుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది.
అలాగే, నైవేద్యం సమర్పించేటప్పుడు.. పాలు పెరుగు, వెన్న, పట్టిక బెల్లం ఏవైనా నైవేద్యంగా సమర్పించవచ్చు. అటుకులు నైవేద్యంగా పెడితే మాత్రం ఆర్థిక ఇబ్బందుల నుంచి తొందరగా బయటపడొచ్చు. ఈరోజు శ్రీకృష్ణుడు అంటే.. వేణుగోపాల స్వామి చిత్రపటం దగ్గర అటుకులు నైవేద్యం పెట్టి కుటుంబ సభ్యుల ప్రసాదంగా స్వీకరిస్తే ఆర్థికంగా కలిసి వస్తుంది. అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉన్నవాళ్లు శ్రీకృష్ణ పరమాత్మ చిత్రపటం దగ్గర నెమలి ఈకలు ఉంచి ఆ తర్వాత ‘ఓం వాసుదేవాయ నమః’ మంత్రాన్ని జపించుకుంటే కృష్ణుడి అనుగ్రహం వల్ల కుటుంబ కలహాల తీవ్రతను తగ్గింప చేసుకోవచ్చు. అలాగే, ఆషాడ శుక్ల ద్వాదశితి వామన రూపంలో ఉన్న శ్రీమహావిష్ణువు కూడా ప్రీతిపాత్రమైన రోజు అని ధర్మసింధు నిర్ణయ సింధు అనే ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. అందుకని ఈరోజు మీ దగ్గర వామన పురాణం ఉంటే.. దాన్ని ఎవరికైనా దానం ఇవ్వండి.
SriKrishna Maha Mantra : స్వామి అనుగ్రహం పొందాలంటే ఈ శ్లోకాన్ని 11 సార్లు చదివితే..
ఒకవేళ, మీ దగ్గర వామన పురాణం అందుబాటులో లేకపోతే దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు ఉదయం పూట పెరుగు దానం ఇవ్వండి. వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి అనుగ్రహం కలిగి భూలాభము, గృహలాభము తొందరగా సిద్ధింప చేసుకోవచ్చు. అంటే.. ఇంటికి సంబంధించిన వ్యవహారాలు చేతి వరకు వచ్చి జారిపోతున్న భూమికి సంబంధించిన వ్యవహారాలు చేతి వరకు వచ్చి జారిపోతున్న వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తిని స్మరించుకుంటూ ఈరోజు పెరుగు దానమిస్తే.. ఇంటి వ్యవహారాలు భూమి వ్యవహారాలు తొందరగా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఈరోజు దీపారాధన చేశాక వాసుదేవ నామాన్ని జపించుకోవడంతో పాటుగా వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తికి సంబంధించిన ఒక ధ్యాన శ్లోకాన్ని కూడా 11 సార్లు చదువుకోవాలి.
ఆ ధ్యాన శ్లోకం.. ‘దేవేశ్వరాయ దేవాయ దేవ సంభూతి కారినే ప్రబవే సర్వదేవా నామ్ వామనాయ నమో నమః’ ఈ ధ్యాన శ్లోకాన్ని కూడా చదువుకుంటే వామన రూపంలో ఉన్న శ్రీమన్నారాయణ మూర్తి అనుగ్రహానికి పాత్రులే కాకుండా సకల శుభాలను పొందవచ్చు. విష్ణుమూర్తికి సంబంధించిన ఒక శక్తి వంతమైన స్తోత్రాన్ని పఠించాలి. ‘విష్ణుపంజర స్తోత్రం‘ ఈరోజు విష్ణుపంజర స్తోత్రాన్ని చదివిన లేదా విష్ణుపంజర స్తోత్రాన్ని విన్న వృత్తిపరంగా, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధిని సాధించవచ్చు. జీవితంలో ఒక మంచి స్థాయికి ఎదగటానికి ఈరోజు విష్ణుపంజర స్తోత్రం వినడం అనేది అద్భుత ఫలితాలను కలిగింపజేస్తుంది. ఆషాడమాసం శుక్లపక్షం ద్వాదశితి సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఏ నామాన్ని జపించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి.
Read Also : Deepam Visistatha : దీపం విశిష్టత ఏంటి? ఏ దీపం వెలిగిస్తే.. ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసా?