Vivasvat Saptami 2023 : ఆషాడ మాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని వివస్వత సప్తమి అనే పేరుతో పిలుస్తారు. ధర్మసింధు అనే ప్రామాణిక గ్రంథంలో ఇదే చెప్పడం జరిగింది. వివస్వత సప్తమి సందర్భంగా సూర్యుని ప్రత్యేకంగా అర్చన చేస్తే.. అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ఉద్యోగంలో తొందరగా ప్రమోషన్లను పొందుతారు. రాజకీయాల్లో కూడా తొందరగా పదవులు పొందవచ్చు. తండ్రివైపు నుంచి రావాల్సిన ఆస్తులు తొందరగా రావడానికి కూడా వివస్వత సప్తమి సందర్భంగా సూర్యుని ప్రత్యేకంగా అర్చన చేయాలి. ఆషాడ శుక్ల సప్తమితికి వివస్వత సప్తమి అనే పేరు ఎందుకు వచ్చింది అంటే.. సూర్యుడికి వివస్వంతుడు అనే పేరు ఉంది. వివస్వంతుడు అంటే తేజవంతుడు అని అర్థం. సూర్యుడు తేజవంతమైనటువంటి తన కిరణాలను భూమి మీదకు ప్రసరింపజేసి భూమి మీద ఉన్నటువంటి వాళ్ళందర్నీ కాపాడుతూ ఉంటాడు. సూర్యనారాయణమూర్తికి వివస్వంతుడు అనే పేరు ఇలా వచ్చింది.
ఈరోజు ఎవరైతే.. ద్వాదశ సప్తమి వ్రతము అనే ఒక శక్తివంతమైన వ్రతాన్ని చేస్తారో సూర్యుడు వెంటనే పరమానంద భరితుడై వారి కోరికలన్నీ వెంటనే నెరవేరుస్తాడని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. ద్వాదశ సప్తమి వ్రతం చేయలేని వాళ్ళు సూర్యుడికి సంబంధించిన ద్వాదశ నామాలు చదువుకుంటూ ఇంట్లో చాలా సులభంగా ఒక పూజ చేసుకున్నా.. సూర్యుడు విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ పూజ ఎలా చేసుకోవాలంటే.. స్నానం చేసిన తర్వాత మీ గృహంలో పూజా మందిరంలో దీపారాధన చేసుకొని ఒక తమలపాకు తీసుకొని ఆ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా ఒక రూపును గీయాలి. ఆ రూపుని సూర్యనారాయణమూర్తి స్వరూపంగా భావిస్తూ చేతిలో అక్షింతలు తీసుకొని ఎర్రటి పుష్పాలు కొన్ని తీసుకుని ‘ఓ మిత్రాయ నమః ఓం రవయే నమః ఓం ఖగాయ నమః ఓం సూర్యాయ నమః ఓం బాణవే నమః ఓం పుష్నే నమః ఓం హిరణ్యగర్థాయ నమః ఓం మరీచినే నమః ఓం ఆదిత్యాయనమః ఓం సవిత్రే నమః ఓం అక్కయ నమః ఓం భాస్కరాయ నమః’ అనే ఈ నామాలు చదువుకుంటూ తమలపాకు మీద తడిగంధంతో గుండ్రంగా గీసినా రూపుకి అక్షింతలు వేస్తూ ఎర్రటి పుష్పాలు వేస్తూ పూజ చేయాలి.
ఈ నామాలు చదువుకున్న తర్వాత కర్పూర హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే ద్వాదశ సప్తమి వ్రతము అనే శక్తివంతమైన వ్రతం చేసిన అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే ఈరోజు సూర్య భగవానుడి ప్రీతి కోసం మీరు స్నానం చేసేటప్పుడు ప్రత్యేకమైన విధివిధానాలతో స్నానం చేయాలి. సూర్యుడికి ఎర్రటి పూలు అంటే ఇష్టం.. కాబట్టి కొన్ని ఎర్రటి పూలు నీళ్లల్లో కలుపుకొని అదే విధంగా సూర్యుడికి కుంకుమపువ్వు అంటే ఇష్టం కాబట్టి చిటికెడు కుంకుమ పువ్వు కూడా నీళ్లలో కలుపుకొని ఆ తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. అలా స్నానం చేస్తే.. అది సూర్యుడికి ప్రియమైన స్నానం అవుతుంది. స్నానం చేసేటప్పుడు ‘జపా కుసుమ సంకాసం కాశ్యపేయం మహాద్భుతం సర్వపాపగ్నం ప్రాణతోష్మి దివాకరం’ అంటూ సూర్యుడు ధ్యాన శ్లోకాన్ని ఏడుసార్లు చదువుకోవాలి. ఇలా స్నానం చేసిన తర్వాత రాగి చెంబులో నీళ్లు తీసుకుని ఆ నీళ్లలో కొన్ని ఎర్రటి పుష్పాలు కొద్దిగా గంధము బెల్లం ముక్క ఎండు మిరపకాయ గింజలు వేసి తూర్పు వైపు తిరిగి ‘ఓం సవిత్రే నమః’ అని 12 సార్లు చెప్పి ఆ నీళ్లు మొక్కలు పోయాలి. అది సూర్యుడికి ప్రియమైన అధ్యమవుతుంది.
Vivasvat Saptami 2023 : భాను సప్తమి రోజు సూర్య దేవుడి అనుగ్రహం తొందరగా పొందాలంటే..
సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు.. ఈరోజు ఎండుమిరపకాయ గింజలు వేసి అర్ఘమిస్తే.. మీకు ట్రాన్స్‌ఫర్లు తొందరగా వస్తాయి. ఎవరికైనా కావాల్సింది చోటికి ట్రాన్స్‌ఫర్ కావాలన్న ప్రమోషన్‌తో పాటుగా ట్రాన్స్‌ఫర్ కావాలన్న ఈ రోజు సూర్యుడికి అర్థం ఇచ్చేటప్పుడు.. ఎండుమిరపకాయ గింజలు నీళ్లల్లో వేసి ఆద్యం ఇవ్వండి. కచ్చితంగా వివస్వత సప్తమి సందర్భంగా సూర్యుడు అనుగ్రహం వెంటనే మీ మీద ప్రసరించి కావలసిన చోటికి అతి తొందరలోనే ట్రాన్స్‌ఫర్ వస్తుంది. అతి తొందరలోనే ప్రమోషన్ కూడా వస్తుంది. అదేవిధంగా, మీరు స్నానం చేసిన తర్వాత సకల దేవతా స్వరూపమైన గోమాతకు నాన్న పెట్టిన గోధుమలు బెల్లం ఆహారంగా తినిపించాలి. అలాగే 1 1/4 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఈరోజు సూర్యభగవానుడికి సంబంధించిన ఆర్యాద్వాదశక స్తోత్రాన్ని చదివినా విన్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి.
సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలలో ఆదిత్య హృదయం సూర్యాష్టకంతో పాటుగా ఆర్య ద్వాదశక స్తోత్రానికి చాలా శక్తి ఉంది. ఈ ఆర్య ద్వాదశిక స్తోత్రానికి ఉన్న గొప్పతనం ఏంటంటే శ్రీకృష్ణుడి కుమారుడైనటువంటి సాంబుడు తనకు తీవ్రమైన అనారోగ్యం ఏర్పడినప్పుడు.. అనారోగ్యం పోగొట్టుకోవటానికి సూర్యుడు గురించి తపస్సు చేస్తాడు. సూర్యుడు ప్రత్యక్షమై భక్తి శ్రద్ధలతో ఆర్య ద్వాదశక స్తోత్రంతో సూర్యుని ప్రార్థిస్తాడు. భయంకరమైనటువంటి చర్మవ్యాధులు ఉన్నవాళ్లు తీవ్రమైన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు వివస్వత సప్తమి సందర్భంగా ఆర్యా ద్వదశక స్తోత్రాన్ని చదవటం లేదా వినటం చేయండి. అష్టోత్రాన్ని ఈరోజు విన్నా కూడా అతి తొందర్లోనే అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు. వయస్సు పెరిగినప్పుడు వృద్ధాప్యంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు తొందరగా దరిచేరకుండా ఉండటానికి కూడా ఈ ఆర్య ద్వాదశక స్తోత్రం విశేషంగా సహకరిస్తుంది.
అలాగే, ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు స్తోత్ర పారాయణులు చేయటం వీలు కాని వాళ్ళు కూడా వివస్వత సప్తమి సందర్భంగా ఇంట్లో దీపారాధన పూజ గదిలో చేసిన తర్వాత ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. ఆ మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ‘ఓం సూర్యనారాయణ పరబ్రహ్మనే నమః‘ ఈ మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా సూర్యుడు విశేషమైన అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింప చేసుకోవచ్చు. ఆషాడ శుక్ల సప్తమితి వివస్వత సప్తమి ఈ సందర్భంగా సూర్యుడు వెంటనే మిమ్మల్ని అనుగ్రహించాలంటే ఇంట్లో దీపారాధన చేశాక ఈ శక్తివంతమైన మంత్రాన్ని 21సార్లు చదువుకోవాలి. ఇలా చేశారంటే సూర్య భగవానుడి అనుగ్రహాన్ని పొందవచ్చు. అనేక సమస్యల నుంచి తొందరగా బయటపడవచ్చు.