Lakshmi Devi : లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టే ముందు కనిపించే 4 సంకేతాలు ఇవే..!

Lakshmi Devi : లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే చాలు.. జీవితమంతా సాఫీగా ఆనందంగా సాగిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ప్రతి ఒక్కరూ ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తుంటారు. చాలామందికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగక ఇంట్లో ఆర్థిక సమస్యలతో అనేక గొడవలతో ఇబ్బందులు పడుతుంటారు. అంతేకాదు.. ఎంత డబ్బు సంపాదించినా చేతిలో ఒక రూపాయి కూడా మిగలక అనవసర ఖర్చులు అవుతుంటాయి. ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి మీ ఇంట్లో దరిద్ర దేవత ఉందనటానికి సంకేతంగా చెప్పవచ్చు. లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగుపెట్టబోతుంది అనటానికి ఎలాంటి సంకేతాలు ఉంటాయో తెలుసా? లక్ష్మీదేవిని అష్టలక్ష్మి దేవిగా పూజిస్తారు. అష్టలక్ష్మిలో దైర్యలక్ష్మి కూడా ఉంటుంది. ధైర్యలక్ష్మీ మహత్యం గురించి ఒక కథ పురాణాల్లో ఉంది. ముందుగా ఈ కథను తెలుసుకోవాలి.

ఎన్నో విజయాలు సాధించిన రాజు అహంకారంతో ధైర్య లక్ష్మీదేవిని విస్మరిస్తాడు. తాను సాధించిన విజయాలన్నీ తన పరాక్రమం వల్లేనని అహంకారంతో ఉంటాడు. దాంతో ధైర్య లక్ష్మీదేవి ఆగ్రహించి అతన్ని విడిచి వెళ్తుంది. ఆ తర్వాత అతడు ధైర్యం కోల్పోయి రాజ్యాన్ని కోల్పోతాడు. రాజు భార్య తమకు పట్టిన దారిద్రాన్ని గురించి ఓ పండితుడిని ఏదైనా పరిహారం చెప్పమని అడుగుతుంది. అప్పుడు సుమేద ఋషి ఇలా చెప్తాడు.. రాజు 3 మాసాల పాటు నిష్టగా ప్రతి నిత్యం సోడా చూపచారాలతో అష్టోత్తర శతనామాలతో ధైర్యలక్ష్మి దేవిని పూజించాలని చెప్పాడు.

Lakshmi Devi : These 4 Indications for lakshmi devi in to your home in telugu
Lakshmi Devi : These 4 Indications for lakshmi devi in to your home in telugu

మహారాణి భర్తతో కలిసి ధైర్య లక్ష్మీదేవిని 3 మాసాలపాటు ప్రతిరోజు భక్తిశ్రద్ధలతో పూజించారు. ధైర్యలక్ష్మి దేవి సంతోషించి ఆ రాజుకి మళ్లీ ధైర్యాన్ని ప్రసాదించింది. ధైర్యలక్ష్మీ కృప ఎంతటి అద్భుతాలను చేస్తుందో ఈ కథ ద్వారా తెలియజేయొచ్చు. ఈ కథ ద్వారా అందరూ నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని ఈ కథ చెప్తుంది. ధైర్యం మనిషికి చాలా అవసరం.. ఆ ధైర్యముంటే దేనినైనా సాధించవచ్చు. ఇక ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుందని చూపించే కొన్ని సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Lakshmi Devi : మీ ఇంట్లో లక్ష్మిదేవి తిష్ట వేసుకుని కూర్చొవాలంటే..

హిందూ సాంప్రదాయం ప్రకారం.. లక్ష్మీదేవి సిరిసంపదలకు అదృష్టానికి ఆది దేవత.. ఆమె అనుగ్రహం ఉంటే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. అలాంటి అదృష్ట దేవత.. మీ ఇంట్లో తిష్ట వేసి కూర్చొంటుంది అనటానికి తెలిపే సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. గుడ్లగూబ మీకు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందని అర్థం. పూర్వం నుంచి మన పెద్దలు చెప్తున్న సత్యం ఇదే.. లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ప్రవేశించబోతుందనే సంకేతం అంతే కాదు.. మీరు ధనవంతులు కాబోతున్నారని సూచన కూడా. గుడ్లగూబను బంధించి అందరికీ చూపిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు. మీకు బయట ఎక్కడైనా గుడ్లగూబ కనిపిస్తే కూడా మీరు ధనవంతులు కాబోతున్నారనటానికి సంకేతంగా భావించవచ్చు. మీరు ఉదయం లేవగానే ఇల్లు ఊడుస్తూ కనిపిస్తే.. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని చెప్పటానికి సంకేతమే.

ఎందుకంటే.. లక్ష్మీదేవికి శుభ్రంగా ఉన్న ఇల్లు అంటే చాలా ఇష్టం. ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే.. తప్పకుండా లక్ష్మీ కటాక్షం కలిగి తీరుతుంది. చెరుకంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం.. చెరుకును లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పిస్తే.. మీరు కోరిన కోరికలను నెరవేరుస్తుంది. మీరు ఉదయం లేవగానే చెరుకు గడ కనిపిస్తే.. మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి వస్తుందని సంకేతంగా భావించవచ్చు. ఈ సంకేతాలు మీరు గ్రహిస్తే.. మీ ఇంట్లోకి త్వరలో లక్ష్మీదేవి రాబోతుందని అర్థం. త్వరలో ధనవంతులు కాబోతున్నారని భావించాలి. ఇంట్లో పూజగదిని కూడా ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. పూజగదిని చీపురుతో అసలు శుభ్రం చేయకూడదు. ఏదైనా సుచియైన వస్త్రంతో శుభ్రం చేసుకోవాలి. ఇలాంటి పనులతో లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు.

Read Also : Varahi Devi Pooja Vidhanam : ఆపదలు తొలగించే వారాహి దేవి అమ్మవారి పూజా విధానం.. ఈ పరిహారం చేస్తే మీ లైఫ్‌లో ఇక తిరుగుండదు..!

Leave a Comment