Dead Person in Dream : చనిపోయిన వాళ్లు తరచూ మీ కలలోకి వస్తున్నారా? దేనికి సంకేతమో తెలుసా?

Dead Person in Dream : ప్రతిఒక్కరికి తరచూ కలలు వస్తుంటాయి. నిద్రిస్తున్న సమయంలో వారి జీవితంలో జరగబోయే మార్పులను ముందుగా కలల రూపంలో హెచ్చరిస్తుంటాయి. కలల్లో చాలా రకాలు ఉన్నాయి.. మంచి కలలు, చెడు కలలు.. పీడ కలలు (Bad Dreams in telugu) కూడా పిలుస్తారు. సాధారణంగా చాలామందికి చనిపోయిన పూర్వీకులు (deceased relative in dream) తరచూ కలలో కనిపిస్తుంటారు. వారు బతికి ఉన్నట్టుగా కనిపిస్తుంటారు. ఇలాంటి కలలు రావడం కామన్.. చనిపోయిన వారు ప్రత్యేకించి కొందరికి మాత్రమే ఎక్కువ కలలో కనిపిస్తుంటారు.

అలా కలలో వస్తుంటే ఏం జరుగుతుందోనని తెగ భయపడిపోతుంటారు. వాస్తవానికి చనిపోయిన వాళ్లు (deceased relative telugu) కలలో వస్తే అనేక అర్థాలు ఉంటాయి. చనిపోయిన వారికి మీ ప్రేమ ఉందని కొందరు అంటే.. వారి కోరికలను మీ ద్వారా తీర్చుకునేందుకు ఇలా కలలో వస్తూ పోతుంటారని మరికొందరు అంటుంటారు. చనిపోయిన ఆత్మీయులు (see dead person in dream) కలలో రావడం వెనుక అనేక అర్థాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

Dead Person in Dream : What happens if we see dead person in dream
Dead Person in Dream : What happens if we see dead person in dream

హిందూ సంప్రదాయం ప్రకారం.. చనిపోయిన వారికి మరణించిన పదహేను రోజుల్లో కర్మకాండలు జరిపించాలి. నెలమాసికాలు, ఏడాది మాసికాలు, సంవత్సరికం వంటివి చేస్తుండాలి. ఇలా ఆచారాలను పాటించడం ద్వారా చనిపోయిన వారి ఆత్మకు శాంతి కలుగుతుందని విశ్వసిస్తుంటారు. ఇలా చేయడం ద్వారా చనిపోయిన వారి ఆశీస్సులు ఆ కుటుంబంపై ఉంటాయట.. స్వప్న శాస్త్రం, గరుడ పురాణం, అగ్ని పురాణం, వాయు పురాణాల్లో కూడా దీని గురించి లోతుగా వివరణ ఇచ్చారు.

Dead Person in Dream : చనిపోయిన వాళ్ళు కలలోకి వస్తే.. ఏమవుతుంది..? శుభమేనా?

పూర్వీకుల కర్మలను ఆచరించే కుటుంబ సభ్యులకు శుభం కలుగుతుందని నమ్ముతారు. పూర్వీకుల ఆశీస్సులు ఆ కుటుంబంపై బలంగా ఉందని అర్థం చేసుకోవాలి. కర్మల సమయంలో అనుకోకుండా ధనం కలిసివస్తే కూడా అది పూర్వీకుల ఆశీస్సులతోనే అని భావించాలి. చనిపోయిన వారు కలలో కనిపించి మిమ్మల్ని సంతోషంగా ఆశీర్వదిస్తున్నట్టు వస్తే మాత్రం.. వారికి ఏదో మంచి జరుగబోతుందని అర్థం.. తల్లిదండ్రులను మంచిగా చూసే వారికి కూడా పూర్వీకుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయట..

Dead Person in Dream : What happens if we see dead person in dream
Dead Person in Dream : What happens if we see dead person in dream

అంతేకాదు.. చనిపోయిన బంధువుల్లో ఎవరైనా కలలో కనిపిస్తే.. మరో అర్థం కూడా ఉంది.. మీ జీవితంలో రాబోయే ఏదైనా సమస్య గురించి ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడానికి ఇలా చనిపోయిన వారు కలలోకి వస్తుంటారట.. కలలో చనిపోయిన వ్యక్తిని దుర్భర పరిస్థితుల్లో చూసినట్టుగా వస్తే మాత్రం ఆత్మ మీ చుట్టూనే తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. మీకు కూడా ఇలాంటి కలలు తరచూ వస్తుంటే మాత్రం.. ఎలాంటి ఆలస్యం చేయకుండా వెంటనే ఎవరైనా నిరుపేదలకు సాయం చేయాలి.

అమావాస్య రోజున ఏదైనా ఆలయాన్ని సందర్శించి దానం చేయడం చేయాలి. చనిపోయిన వ్యక్తి కలలో ఆనందంగా కనిపిస్తే అన్ని శుభవార్తలే వింటారని అర్థం చేసుకోవచ్చు. మీరు తలచిన కార్యం ఏదైనా నిర్విగ్నంగా పూర్తి చేస్తారని భావించవచ్చు.. మీకు కూడా ఇలాంటి కలలు వస్తుంటే.. వాటికి అర్థం ఏంటి అనేది ఓసారి తెలుసుకోండి..

Read Also : Death Person Clothes : చనిపోయిన వ్యక్తి బట్టలు మనం ధరించకూడదా? వారి వస్తువులు వాడితే ఏమవుతుందో తెలుసా?

Leave a Comment