Malli Pelli Movie Song : పవిత్రా లోకేష్‌, నరేష్ ఘాటు ప్రేమ.. ‘మళ్లీ పెళ్లి’ వర్షం సాంగ్ ఇదిగో.. కిరాక్కు పుట్టిస్తున్న క్రేజీ జంట..!

Malli Pelli Movie Song : పవిత్రా లోకేష్, నరేష్.. పెద్దగా పరిచయం అక్కర్లేని జంట.. ముదురు వయస్సులోనూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ప్రేమకు వయస్సుతో సంబంధం లేదని, ఏ వయస్సులోనైనా ప్రేమ పుడుతుందని అనడానికి ఈ క్రేజీ జంటే నిదర్శనం.. వీరిద్దరి మధ్య ప్రేమ వ్యవహారానికి సంబంధించి వార్తలు బయటకు వచ్చినప్పటి నుంచి పవిత్ర లోకేష్ (Pavithra Lokesh), నరేష్ (Dr Naresh V.K) అనగానే అందరిలో ఒక అటెన్షన్ మొదలైంది. ఈ జంట గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా నెట్టింట్లో వైరల్ అవ్వాల్సిందే..

ఇదే క్రేజ్‌ను పవ్రితా లోకేష్, నరేష్ కు బాగా కలిసొచ్చింది. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘మళ్లీ పెళ్లి’ పేరుతో కొత్త మూవీ రాబోతోంది. మే 26న ఈ మూవీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే, మూవీ రిలీజ్ కు ముందే చిత్ర యూనిట్ టీజర్ (Malli Pelli Telugu Teaser) రిలీజ్ చేశారు. దానికి ఆడియెన్స్ నుంచి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. పెద్ద బడ్జెట్ మూవీ కన్నా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలోనే మూవీ మేకర్స్ ఒకదాని తర్వాత ఒకటిగా పాటలను రిలీజ్ చేస్తున్నారు.

Malli Pelli Movie Song : రా రా హోసూరు నాతో.. రొమాంటిక్ రైన్ సాంగ్ చూశారా? 

ఈ మూవీలోని సన్నివేశాలు వీరిద్దరి రియల్ లైఫ్ కు దగ్గరగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజ జీవితంలో జరిగినవే సన్నివేశాలుగా చిత్రీకరించినట్టుగా తెలుస్తోంది. పవిత్ర లోకేష్, నరేష్ కు సంబంధించి ఎలాంటి న్యూస్ వచ్చినా ట్రోలర్లు మాత్రం ఎంతమాత్రం తగ్గడం లేదు. మళ్లీ పెళ్లిపై ఎలాంటి అప్ డేట్ బయటకు వచ్చినా వెంటనే ట్రోల్ చేయడానికి రెడీ అన్నట్టుగా కనిపిస్తోంది. ఏదిఏమైనా.. మళ్లీ పెళ్లి మూవీ నుంచి ‘రా రా హోసూరు నాతో..’ (Ra Ra Hussooru Nattho Song) అనే రొమాంటిక్ రెయిన్ సాంగ్ రిలీజ్ అయింది.

ఈ పాటలో నరేష్, పవిత్ర లోకేష్‌ మాత్రమే కాదు.. మరో జంట కూడా కనిపించింది. ఈ పాట కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. మళ్లీ పెళ్లి మూవీని డైరెక్టర్ ఎం.ఎస్. రాజు తెరకెక్కించారు. ఈ సినిమాను అందరూ ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడదగిన సినిమాగా చెప్పవచ్చు. నరేష్, పవిత్ర లోకేష్ క్రేజీ కాంబినేషన్ కావడంతో మూవీకి మరింత హైప్ తీసుకురానుంది. వీరిద్దరిని చూడటానికైనా థియేటర్ వెళ్లే ఆడియన్స్ తప్పక ఉంటారనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. అంత క్రేజ్ ఉంది మరి.. ఈ సినిమా రిలీజ్ అయ్యాక మీరు కూడా మళ్లీ పెళ్లి మూవీని చూసి ఎంజాయ్ చేయండి..

Read Also : Bike Stunt Video : బైకుపై ఈ ఇద్దరు అమ్మాయిల స్టంట్ చూశారా? ముద్దులు.. హగ్గులిచ్చుకుంటూ.. వీడియో!

Leave a Comment