Bike Stunt Video : ప్రస్తుత రోజుల్లో సోషల్ మీడియాలో ఓవర్ నైట్ స్టార్ అయ్యేందుకు వెర్రి చేష్టలకు పాల్పడుతున్నారు. ప్రమాదకరమని తెలిసి కూడా బైక్ స్టంట్ చేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి బైక్ స్టంట్‌లు అబ్బాయిలు చేయడం కామన్.. కానీ, ఇప్పుడు అందుకు భిన్నంగా ఇద్దరు అమ్మాయిల బైక్ స్టంట్ చేశారు. అంతంటితో ఆగలేదు.. ఏకంగా ఇద్దరూ అసభ్యంగా ప్రవర్తిస్తూ బైక్ స్టంట్ చేశారు.
బైక్ మీద ఇద్దరు అమ్మాయిల ముద్దులు పెట్టుకుంటూ ఎలా స్టంట్ చేస్తున్నారో చూడండి.. కొంచెం కూడా విచక్షణ లేకుండా బైకుల మీద హగ్ లిచ్చుకుంటూ స్టంట్ చేస్తున్నారు. ఇద్దరు అమ్మాయిల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమ వీడియోలను వైరల్ చేసేందుకు ఎంతకైనా దిగజారుతున్నారు. ప్రాణాలను కూడా లెక్కచేయకుండా ఇలాంటి స్టంట్‌లు చేస్తున్నారు.

ఇదంతా సోషల్ మీడియాలో ఓవర్ నైట్ ఫేమస్ అయిపోవాలని ప్రాణాలకు మీదుకు తెచ్చుకుంటున్నారు. వేగంగా వెళ్లే బైకుపై ఇద్దరు అమ్మాయిలు ఎదురెదురుగా కూర్చొని హగ్ లిచ్చుకుంటూ.. ముద్దులు పెట్టేసుకుంటున్నారు. బైక్ హ్యాండిల్ కూడా వదిలేశారు.
జరగరానిది జరిగితే ఇద్దరి పరిస్థితి ఏంటి.. ఇలాంటి వెర్రి చేష్టలతో ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ఇద్దరు అమ్మాయిల స్టంట్ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇలాంటి ఘటనలకు పాల్పడే వారికి వారి తల్లిదండ్రులు బుద్ధిచెప్పాలని నెటిజన్లు అంటున్నారు. బుద్ధిగా చదువుకోవాల్సిన వయస్సులో ఇలాంటి పనులు చేయడం ఏంటి అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.
మరో వీడియోలో ఓ కుర్రాడు స్కూటర్ పై వెళ్తూ.. బస్సు వెనుక కాళ్లను ఎలా పెట్టి వెళ్తున్నాడో చూడండి.. ఈ వీడియో వైరల్ కావడంతో విసి సజ్జనర్ స్పందించారు. వెర్రి వేయి విధాలు అంటే ఇదేనని ట్వీట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి అని ట్వీట్ లో హెచ్చరించారు.
వెర్రి వేయి విధాలు అంటే ఇదే!
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం రోడ్లపై ఇలాంటి పిచ్చి వేషాలు వేయకండి. ప్రమాదాల బారినపడి మీ తల్లితండ్రులకు శోకాన్ని మిగల్చకండి.#RoadSafety @MORTHIndia pic.twitter.com/24GFCp8vvX
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) May 2, 2023
Read Also : Migraine Headache : తలనొప్పి, మైగ్రేన్ విపరీతంగా బాధిస్తున్నాయా.. ఈ యోగాసనాలతో చెక్ పెట్టండిలా..!