Seasonal Allergies : సీజనల్ అలర్జీలతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ అద్భుతమైన వంటింటి చిట్కాలను ఓసారి ట్రై చేయండి.. తొందరగా ఉపశమనం పొందవచ్చు. గొంతులో నొప్పి, జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలతో బాధపడుతున్నారా? అయితే వెంటనే ఈ కషాయాలను ఇంట్లోనే తయారుచేసుకుని సేవించండి. తొందరగా సీజనల్ వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చు.. సాధారణంగా వంటింట్లో విరివిగా లభించే మసాలా దినుసులతో ఎలాంటి సీజనల్ వ్యాధులనైనా వెంటనే తగ్గించుకోవచ్చు. ఇంతకీ ఈ కషాయాలను ఎలా తయారుచేయాలో చూద్దాం.
1. లవంగం-దాల్చినచెక్క కషాయం :
లవంగం-దాల్చినచెక్క కషాయం తయారీ కోసం కుండలో ఒక గ్లాసు నీరు పోయాలి. బాగా మరిగించాలి. లవంగాలు, యాలకులు, దాల్చినచెక్కను వేసి నీళ్లలో మరిగించాలి. ఒక టీస్పూన్ పార్స్లీ, టీస్పూన్ అల్లం, నల్ల ఉప్పు సగం టీస్పూన్, పసుపు సగం టీస్పూన్ వేయాలి. అలాగే నల్ల మిరియాలు కూడా సగం టీస్పూన్ వేయాలి. అంతేకాదు.. తులసి ఆకులు కూడా వేయాలి.
ఈ మిశ్రమాన్ని నీరు సగానికి ఆవరి అయ్యేవరకు మరిగించాలి. ఆ మిశ్రమాన్ని వడపోయాలి. ఇలా తయారైన కషాయాన్ని రోజుకు కనీసం రెండుసార్లు తాగుతుండాలి. ఇలా తాగడం వల్ల జలుబు, ఛాతి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు. శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
2. అల్లం ముక్కతో కషాయం :
తురిమిన అల్లం తీసుకోవాలి. ఏదైనా గిన్నెలో నీటిని కాచాలి. అందులో ఈ అల్లం మిశ్రమాన్ని కలపాలి. అంతేకాదు.. లవంగాలు, యాలకులు, బెల్లం, అల్లం, నల్ల మిరియాలతో కలిసిన మిశ్రమాన్ని కూడా ఇందులో కలపాల్సి ఉంటుంది. కొంతసమయం వరకు మరిగించాలి. కాసేపు అయ్యాక తులసి ఆకులు వేయాలి. నీరు సగానికి ఆవరి అయ్యేవరకు మరిగించాలి. అనంతరం వడపోయాలి. ఈ కషాయంలో రుచి కోసం బెల్లం కలపాలి. పిల్లలు కూడా తాగొచ్చు. ఈ కషాయం తాగడం ద్వరా దగ్గు, జలుబు, గొంతు నొప్పి సమస్యల నుంచి వెంటనే రిలీఫ్ పొందవచ్చు.
3. నిమ్మరసం-మిరియాలతో కషాయం :
నిమ్మరసం-మిరియాలతో కషాయం తయారుచేసుకోవచ్చు. ఒక గిన్నెలో ఒక గ్లాసు నీటిని మరిగించాలి. అందులో టీస్పూన్ మిరియాలు, రెండు టీస్పూన్ల నిమ్మరసాన్ని వేసి మరిగించాలి. ఈ రసాన్ని ప్రతి రోజూ ఉదయం తాగుతుండాలి. తద్వారా చలి నుంచి రిలీఫ్ పొందవచ్చు. ఇలా చేయడం ద్వారా శరీరంలో వేడి పెరుగుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పూర్తిగా తగ్గిపోతుంది.
4. బెల్లం-వాముతో కషాయం :
బెల్లం-వాముతో కషాయం తయారుచేసుకోవచ్చు.. అదేలానంటే.. ఒక గిన్నెలో గ్లాసు నీరు పోయాలి.. కొంతసేపు బాగా మరిగించాలి. కొంచెం బెల్లంతో పాటు సగం టీ స్పూన్ వాము వేసి బాగా మరిగించాలి. గిన్నెలో నీరు సగానికి వచ్చేవరకు మరిగించాలి. ఆ కషాయాన్ని వడపోసి తాగేయాలి. ఇలా ప్రతిరోజు చేయడం ద్వారా జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఏమైనా అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలు ఉంటే వెంటనే తగ్గిపోతాయి. కడుపునొప్పి సమస్యల నుంచి తొందరగా రిలీఫ్ పొందవచ్చు.
సీజనల్ వ్యాధుల నుంచి తప్పించుకోవాలంటే ప్రతిరోజూ ఉదయాన్నే లేవగానే ఈ వేడినీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. అది కూడా పరిగడపున తాగడం చేయాలి. నిత్యం ఈ విధంగా చేస్తుండటం వల్లన మీ జీర్ణాశయంలోని వ్యర్థాలు బయటకు వెళ్లిపోతాయి.
Read Also : Bedu Fruit Benefits : బేడు పండు వలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు..!