Brahma Muhurta : బ్రహ్మ ముహూర్తం అంటే ఏమిటి? బ్రహ్మ ముహూర్తం ప్రాముఖ్యత ఏమిటి! బ్రహ్మ ముహూర్తం గురించి తెలుసుకుందాం.. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం.. ఈ కాలాన్ని అసలు వృధా చేయకూడదని అంటారు. పూర్వం కాలాన్ని గడియల్లో లెక్కించేవారు. ఒక గడియకు ప్రస్తుతం మన కాలమానం ప్రకారం 24 నిమిషాలు ముహూర్తం అనగా రెండు గడియల కాలం అంటే 48 నిమిషాలనే ముహూర్తం అంటారు. ఒక పగలు ఒక రాత్రి మొత్తాన్ని కలిపి అహోరాత్రం అంటారు. అహోరాత్రానికి ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. ఒక్క రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయని అర్థం.. సూర్యోదయానికి ముందు వచ్చే మొదటి ముహూర్తాన్ని బ్రహ్మముహూర్తం అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం..
ఈ ముహూర్తానికి ఆదిదేవుడు బ్రహ్మ కాబట్టి.. బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవ్వడానికి 98: 48 నిమిషాల మధ్య కాలమే ఇది.. నిజానికి తెల్లవారుజామును రెండు భాగాలుగా విభజించారు. సూర్యోదయానికి రెండు గడియల కాలాన్ని 48 నిమిషాలకు ముందు కాలాన్ని ఆసరి ముహూర్తాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ప్రతిరోజు బ్రహ్మ ముహుర్తాన నిద్రలేచి భగవంతుని జ్ఞానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మ ముహూర్తానికి అత్యధిక ప్రాధాన్యత ఉంది. అనేకమంది నూతన గృహానికి ప్రవేశానికి ఈ సమయాన్నే ఎక్కువగా ఎన్నుకుంటారు.
ఈ సమయంలో మానవుడి మేధాశక్తికి భగవంతుడు శక్తి తోడు అవుతుంది. బ్రహ్మ ముహూర్తం అనేది అన్ని శుభకార్యాలకు ఉన్నతమైనది, శక్తివంతమైనది.. బ్రహ్మ ముహూర్తం అనే పేరు ఎలా వచ్చింది అనేది పురాణ కథలు కూడా ఉన్నాయి. ఈ బ్రహ్మ ముహూర్తం కాలాన ఇవే చదివే చదువు, చేసే శుభకార్యాలు, నిర్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు. ఉదయం 3 నుంచి 6గంటలు ఉండే సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు.
ఆధ్యాత్మిక చింతన చేసే వారికి విద్యార్థులకు ధ్యానము, జప తపాదులు చేసేవారికి చాలా విలువైన సమయం.. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా , స్వచ్ఛంగా ఉంటుంది. అందుకే ఆ సమయంలో సన్యాసులు యోగులు, పరహంసలు, ఋషులు హిమాలయంలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపస్సు శక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు అందువలన ఆ సమయంలో చేసే ధ్యానము మనకు ఆధ్యామికతగా సిద్ధిస్తుంది. కానీ, చాలామంది ఆ సమయంలో నిద్రతో వృథా చేస్తూ ఉంటారు.
ఆధ్యామికత తరంగాలను నష్టపోతారు.. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేల్కొని ఉండమంటారు మన పెద్దలు. చల్లని నీటితో తల స్నానం చాలా మంచిది. దీనితో మెదడు,కళ్ళు చల్లగా ఉంటాయి. బ్రహ్మ ముహూర్తాన ఆసనాలు, ప్రాణాయం, ధ్యానం, కీర్తనలు, శ్లోకాలు సాధన చేయడం వల్ల చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తం చాలా విలువైన కాలం ఈ సమయం వృధా చేయకుండా పూజలకు, పద్మాసనం, ప్రాణాయం, యోగ, కూర్చొని చేసే ధ్యానం మనోశక్తి లభిస్తుంది.
మొదలుపెట్టేముందు 12సార్లు ఓంకారం లేదా 5 నిమిషాలు ఏదైనా కీర్తన పాడడం వలన మనసు త్వరగా భగవత జ్ఞానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది. బ్రహ్మ ముహూర్తాన చేసే ఓంకారం ధ్వని వల్ల సుష్మ నాడి తెరుచుకుంటుంది. మహర్షులు, ఋషులు ఆ సమయంలో శబ్దం గట్టిగా వచ్చేలా ఓంకార శబ్దాన్ని జపిస్తారు.. ఎప్పుడైతే మన నాసిక రంద్రాలలోకి శ్వాస ప్రవహిస్తుందో వెంటనే సుష్మ నాడి పనిచేయడం మొదలు పెడుతుంది.. అప్పుడే మన ధ్యానం బాగా కుదురుతుందని శాస్త్రం చెప్తుంది.. ప్రతినిత్యం బ్రహ్మ ముహూర్తాన ఎవరైతే నిద్ర లేస్తారో వారికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి.
Read Also : Devotional : పూర్వీకుల నుంచి వచ్చిన ఈ సంప్రదాయాలు మీకు తెలుసా?