Mutton Pickle Recipe : మటన్ నిల్వ పచ్చడి చూస్తునే నోరూరిపోతుంది. అదే తింటే మాత్రం ఇంకా ఎంతో అద్భుతంగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో చపాతి, పరోట, పూరి, బగారా, పులావ్, బిర్యానీ తో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మటన్ పచ్చడి తినని వాళ్లు కూడా చూస్తే నోరూరిపోతుంది. మటన్ పచ్చడిని ఇలా తయారుచేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది. కొంచెం కూడా పాడవదు. నిల్వ ఉంచే కొద్ది మటన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఎన్ని రోజులైనా సరే మటన పచ్చడి కొంచెం కూడా చెక్కు చెదరదు.. మటన్ పచ్చడి చెడిపోకుండా ఉండేందుకు అందులో కొన్ని ముఖ్యమైన దినుషులు వేయడం వల్ల చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది. మీరు కూడా మటన్ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? ఇదిగో ఇలా చేయండి..
కావలసిన పదార్థాలు.. మటన్ 2 కేజీలు, పసుపు, ఉప్పు (రుచికి తగినంత), కారం (రుచికి తగినంత), అల్లం వెల్లుల్లి పేస్ట్,
తయారీ విధానం… ముందుగా బోన్ లెస్ మటన్ శుభ్రంగా కడుక్కోవాలి. స్టాప్ వెలిగించి లో ఫ్లేమ్ లో ఉంచి కుక్కర్ పెట్టి మటన్ వేసి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పసుపు, రెండు స్పూన్ల ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి. మటన్ లో ఉన్న వాటర్ తోటే ఉడుకుతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్ లో ఉంచి 8 విజిల్స్ ఉడికించాలి. ఒకసారి చూసుకొని మటన్ ఉడికిందో లేదో ఉడక పోతే లో ఫ్లేమ్ లో ఉంచి మరో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
మటన్ లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించాలి అప్పుడు మెత్తగా ముక్క ఉడుకుతుంది. మరోవైపు స్టాప్ ఆన్ చేసి కళాయి పెట్టి ఆయిల్ (హాఫ్ కేజీ) డీప్ ఫ్రై కి సరిపోయేంత నూనె వేసి హై ఫ్లేమ్ లో ఉంచి నూనె వేడి అయిన తర్వాత వేడివేడి మటన్ ముక్కలు వేసుకోవాలి. మటన్ ముక్కలు చల్లారనివ్వకూడదు చల్లారితే ముక్క మెత్తగా ఉండదు గట్టిపడుతుంది. ఇప్పుడు మటన్ ముక్కలను కొంచెం వేగిన తర్వాత సన్నగా కట్ చేసిన (పావు కేజీ)25, పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. గుప్పెడంత కరివేపాకు వేసి వేగనివ్వాలి.
లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. పచ్చిమిర్చి, కరివేపాకు ఇలా వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి మటన్ కర్రీ చల్లారిన తర్వాత ఆరు టేబుల్ స్పూన్ల కారం, ధనియాలు పొడి రెండు టేబుల్ స్పూన్స్, గరం మసాలా ఒకటిన్నర టేబుల్ స్పూన్, పచ్చట్లో ఉప్పు, కారం, నూనె, పులుపు తప్పనిస సరిపోను వేసుకోవాలి. ఒక కప్పు(8) నిమ్మకాయల రసం బాగా కలపాలి. (10)వెల్లుల్లి రెబ్బలు వేసి కలపాలి. జాడీలో, గాజు సీసాలో నిల్వ చేసుకోండి రెండు మూడు నెలలు అయినా ఉంటుంది. ఎంతో రుచికరమైన మటన్ నిల్వ పచ్చడి రెడీ…
Read Also : Mutton Fry : మటన్ ఫ్రై.. ఒక్కసారి ఇలా చేసి చూడండి.. ఫంక్షన్లలో ఉన్నట్టే ఎంతో టేస్టీగా ఉంటుంది..!