Devotional : ప్రస్తుతం మనుషుల ఆయుష్షు రోజురోజుకూ తగ్గిపోతున్నది. తినే తిండిలో ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు గణనీయమైన మార్పులు వచ్చాయి. బలవర్ధకమైన ఆహారం లభించడం కష్టతరంగా మారడంతో పాటు జీవనశైలిలో మార్పులు బాగా ప్రభావితం చేస్తున్నాయి. అయితే, మన పూర్వీకుల నాటి పరిస్థితులు ఇప్పుడు లేవు. అప్పట్లో వారు ఆచరించిన ఆచారాల వల్ల చాలా కాలం పాటు జీవించగలిగారు. అయితే, ఆ ఆచారాలను మనం సంప్రదాయంగా కొనసాగిస్తున్నాం. కాగా, ఆ సంప్రదాయాల్లో కొంత మేరకు శాస్త్రీయత ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ సంప్రదాయాలు ఏమిటంటే..

హిందువులు సాధారణంగా పర్వదినాల్లో మాంసాహారం అస్సలు తీసుకోరు. ఈ పర్వ దినాలు ఏంటంటే.. ప్రతీ మాసంలో వచ్చే ఏకాదశి మాత్రమే కాకుండా వారంలో ఉండే రోజుల్లో కొన్ని వారాలు తమకు ఇష్టమైన దేవుడి రోజుగా భావించి, ఆ రోజు వారు నిష్టంగా శాకాహారం మాత్రమే తీసుకుంటారు. సంక్రాంతి, దసరా, దీపావళి, అక్షరతృతీయ, కార్తీక మాసం, శ్రావణం వంటి పండుగల నాడు శాకాహారం మాత్రమే తీసుకుంటారు. మన దేశం సంప్రదాయలు, సంస్కృతికి కేరాఫ్ కాగా, ఇలా సంప్రదాయం ప్రకారం మాంసాహారం తీసుకోకుండా నిష్టగా, భక్తి శ్రద్ధలతో దేవుళ్లను ప్రజలు పూజించడం మంచిదేనని పెద్దలు అంటున్నారు.
అయితే, ఇలా పండుగలు, ఇతర పర్వ దినాల్లో మాంసాహారం మాత్రమే కాకుండా మొత్తంగా మాంసాహారం జోలికి పోకూడదని కొందరు సూచిస్తుంటారు. అయితే, అలా మొత్తం తినకుండా ఉండటం సాధ్యం కాదనే ఇలా వారంలో కొన్ని రోజులు ఇలా పెట్టినట్లు చెప్తుంటారు. ఇకపోతే ఈ ప్రత్యేక రోజుల్లో జంతువులను, పక్షులను హింసించడం కాని చంపడం కాని చేయడం పాపమని హిందువుల నమ్మకం. ప్రతీ రోజు మాంసం తినడం వలన భూమిపైన జీవరాశి మనుగడ ప్రశ్నార్థకమయ్యే చాన్సెస్ ఉంటాయని హెచ్చరికగానూ భావిస్తుంటారు. మొత్తంగా మన పూర్వీకులు వారానికి ఒక దేవుడిని పెట్టి మాంసాహారం తినడం నియంత్రించగలిగారని పెద్దలు చెప్తున్నారు..
Read Also : Garuda Puranam : గరుడ పురాణంలోని రహాస్యాలు.. జీవితంలో ఎలాంటి తప్పులు చేశారు.. చనిపోయాక ఏం జరుగుతుందంటే..?