Minumula Java : మినుముల జావా.. ఒంట్లో వేడిని తగ్గించే అద్భుతమైన హెల్దీ డ్రింక్.. ఇలా చేస్తే రుచికి రుచి.. ఆరోగ్యానికి ఆరోగ్యం..!

Minumula Java : హెల్దీ డ్రింక్ మినుముల జావా.. పురాతన కాలం నాటి నుంచి ఈ జావాను తాగుతున్నారు. కానీ, చాలామంది ఇతర ధాన్యాలతో జావాను తాగుతుంటారు. మినములతో జావను తయారు చేసుకోవచ్చునని మీకు తెలుసా? మినుముల జావ రుచికి రుచి మాత్రమే కాదు.. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తుంది. ప్రత్యేకించి వేసవిలో వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి, ఒంట్లో చలువ చేసేందుకు అద్భుతంగా ఉపయోగపడుతుంది.

మినుముల జావ ఒంటికి బలాన్ని కూడా ఇస్తుంది. అందుకే పాత రోజుల్లో ఎక్కువగా ఈ మినుముల జావను తాగేవాళ్లు. శరీరానికి సత్తువనిచ్చే మినుముల జావ ఆరోగ్యానికి ఎంతో మంచిదో తెలిసింది కదా.. చిరుధాన్యాలతోనే కాకుండా మినువులతో కూడా జావను తయారు చేసుకొని బ్రేక్ ఫాస్ట్‌లో తాగవచ్చు.. ఇంతకీ ఈ మినుముల జావను ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

Minumula Java in telugu
Minumula Java in telugu

కావలసిన పదార్థాలు.. మినువులు 1/4 కప్పు,  బెల్లం 1/2 కప్పు,  పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు,  యాలకులు 4,  ఉప్పు..

తయారీ విధానం.. ముందుగా స్టెప్ వెలిగించి కళాయి పెట్టుకుని మినుములు వేసి సన్నని సెగపై కలుపుతూ మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. మినువులు నాలుగైదు నిమిషాలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యం, టీ స్పూన్ మెంతులు వేసి వేగించాలి. వేయించుకున్న పప్పును ఒక బౌల్లో తీసుకొని నీళ్లు పోసి నాలుగు లేదా ఐదు గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు నానిన మినుములును మిక్సీ జార్ లో వేసి ఇందులో నాలుగు యాలకులు వేసి నీళ్లతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.

అరకప్పు బెల్లం తురుము నీళ్లు పోసి కరిగించి బెల్లం నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు ఒక లీటర్ నీళ్లు పోసి మరగనివ్వాలి. అందులో గ్రైండ్ చేసుకున్న మినుముల పేస్టును కొంచెం కొంచెం ధారల వేసుకుంటూ కలపాలి. అప్పుడు ఉండలు కట్టవు. మినువుల జావా కొంచెం చిక్కబడేంత వరకు కలుపుతూ ఉండాలి. అందులో కరిగించిన బెల్లం నీళ్లు పోసి కలపాలి. జావా చిక్కబడిన తర్వాత పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము, రుచికి తగినంత ఉప్పు ఒక్క నిమిషం మరిగించి సొంటి పొడి ఆప్షనల్.. స్టవ్ ఆఫ్ చేయండి. ఎంతో రుచికరమైన మినువుల జావా రెడీ.

Read Also : Ragi Recipes : రాగి పిండితో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. అనేక రకాల వంటలు తయారు చేసుకోవచ్చు తెలుసా?

Leave a Comment