Treadmill Workout : కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రతీ ఒక్కరు ఆరోగ్యంపైన శ్రద్ధ వహించడం ప్రారంభించారు.కొవిడ్ కట్టడికి విధించిన లాక్ డౌన్ కాలంలో దాదాపుగా అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ క్రమంలోనే వారు వ్యాయామం ఇతర ఇంట్రెస్ట్స్‌పైన కాన్సంట్రేట్ చేశారు. కాగా చాలా మంది ఇప్పుడు చిన్న వయసులోనే బాగా బరువు అవుతున్నారు. ఇందుకు మారుతున్న జీవన శైలి ప్రధాన కారణం. జంక్ ఫుడ్ బాగా తీసుకుంటున్నారు దాంతో పాటు శారీరక శ్రమ తగ్గిపోయింది. ఫలితంగా బాగా వెయిట్ గెయిన్ అవుతున్నారు.

ఫిట్‌నెస్ పైన కాన్సంట్రేట్ చేసేవారితో పాటు వెయిట్ తగ్గించాలనుకునే ప్రతీ ఒక్కరు ఇటీవల కాలంలో ట్రేడ్ మిల్స్ తీసుకుంటున్నారు. ట్రేడ్ మిల్‌పైన వర్కవుట్స్ చేయడం వలన వెయిట్ తగ్గినట్లు చాలా మంది ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో పేర్కొన్నారు. దాంతో చాలా మంది ట్రేడ్ మిల్ వర్కవుట్స్ చేస్తున్నారు. అయితే, నెట్‌లో చూసి ట్రేడ్‌మిల్‌పైన వర్కవుట్స్ చేస్తే ప్రమాదమే. కాబట్టి నిపుణులను సంప్రదించన తర్వాతనే వర్కవుట్స్ చేయాలి. ఎందుకంటే దాని సెట్టింగ్స్ గురించి అందరికీ అవగాహన ఉండకపోవచ్చు. ట్రేడ్ మిల్‌పైన వర్కవుట్ చేసినపుడు మూడు విషయాలపైన అది ఫోకస్ చేస్తుందన్న సంగతి గ్రహించాలి.
ఇంక్ లైన్ లెవల్, స్పీడ్ ఆఫ్ త్రి, వర్కవుట్ టైం.. ఈ మూడింటిని గురించి తెలుసుకోవాలి. ఇకపోతే ట్రేడ్ మిల్‌పైన వాకింగ్ అనేది ఒకే రోజు చేయడం ద్వారా వెయిట్ లాస్ అవరు. క్రమం తప్పకుండా ప్రతీ రోజు నిపుణుల సూచనల ప్రకారం సెట్టింగ్స్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారానే మీరు వెయిట్ లాస్ అవుతారు. ఇకపోతే ఎక్సర్‌సైజెస్‌పైన కాన్సంట్రేషన్ చేయడంతో పాటు ఫుడ్ హ్యాబిట్స్‌పైన కూడా దృష్టి సారించాల్సి ఉంటుంది. నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్న తర్వాతనే వర్కవుట్ లెవల్స్ పెంచుకుంటే మంచిది. అలా చేస్తేనే మీరు అనుకున్న లక్ష్యం.. బరువు తగ్గడం నెరవేరుతుంది.
Read Also : Weight Loss Exercises : బరువు తగ్గాలంటే రోజుకి ఎన్ని గంటలు ఎక్సర్‌సైజ్ చేయాలో తెలుసా?