Dates Health Benefits : మనిషి తన జీవితకాలంలో ఆరోగ్యా్న్ని పెంపొందించుకోవాలంటే కొన్ని ఆహారపు అలవాట్లను తప్పకుండా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ప్రతీ సీజన్లో దొరికే పండ్లను తప్పకుండా తినాలి. దీనివలన శరీరంలోని మలినాలు తొలగిపోయే ఆస్కారం ఉంటుందని, అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు లైఫ్ స్పాన్ కూడా పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వయస్సు మీద పడుతున్న కొద్దీ శరీరంలో శక్తి తగ్గిపోతుంటుంది. అలాంటి సమయంలో బలమైన ఆహారం తీసుకోవాలి. ఖర్జూరాలు అన్ని సీజన్లలో దొరుకుతాయి. వీటిని రెగ్యులర్‌గా తీసుకోవడం వలన శరీరంలో విటమిన్లు, ప్రోటీన్లు పెరిగి శక్తి చేకూరుతుంది.
ఖర్జూర పండ్లు తినడం వలన బ్రెయిన్ పనితీరు మెరుగవుతుంది. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అనేక వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తాయి. ఎండు ఖర్జూర తినడం వలన కేలరీలు, కార్బోహైడ్రేట్స్ శరీరానికి అందుతాయి. ఉదాహరణకు 100 గ్రాముల ఖర్జూరంలో 75 గ్రాముల కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇది మనశరీరానికి 277 కేలరీల శక్తిని అందిస్తుంది. ఖర్జూరలో పొటాషియం, కాపర్, మెగ్నీషియం, ఐరన్, మాంగనీస్, విటమిన్ బి-6, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. వీటిలో కొలెస్ట్రరాల్ శాతం తక్కువగా ఉంటుంది. గుండె జబ్బులున్నవారికి మంచి మెడిసిన్‌లాగా పనిచేస్తుంది.
కొందరు సీజన్‌తో సంబంధం లేకుండా ఖర్జూరను తీసుకుంటుంటారు. అయితే, చలికాలంలో ఈ పండ్లను తినడం వలన శరీరానికి ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. శీతాకాలంలో బ్రెయిన్లో ఇంటర్ లుకిన్ (IL-6) అనే పదార్థం పేరుకుపోవడం వలన మెదడు ఒక వైపు వాపునకు గురికావచ్చు. అలా జరగకుండా ఉండాలంటే ఖర్జూరాలను తినాలి. వీటి వినియోగం IL-6ను పెంచుతుందని ఓ పరిశోధనలో తేలింది. మెదడు వాపును తగ్గిస్తుంది. అలాగే అల్జీమర్స్ సమస్యకు చెక్ పెడుతుంది. ఖర్జూరలో పొటాషియం, క్యాల్షియం, కాపర్, మెగ్నీషియం, సెలీనియం వంటి ప్రోటీన్లు ఉండటం ఎముకలను అధిక శక్తిని అందించి బలాన్ని చేకూరుస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వలన బాడీలో ఫ్రీ రాడికల్స్ రాకుండా చూస్తాయి.
Read Also : Alzheimer : మీ ఫ్యామిలీలో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే వారికి అల్జీమర్స్ వ్యాధి సోకినట్టే..!