Knee Pains Tips : ప్రస్తుత రోజుల్లో మనిషి కొంచెం టైం కష్టపడినా త్వరగా అలసిపోతున్నాడు. మనం వాడే ప్రతీ వస్తువు కల్తీ అవుతుండటంతో ఏది నిజమైనది.. ఏది అబద్ధం అని తెలుసుకోవడం చాలా కష్టం. దీని వలన జనం అనారోగ్యం బారిన పడుతున్నారు. పోషకాహార లోపం, టైంకు తినకపోవడం, నిద్ర సరిగా లేకపోవడం, పని ఒత్తిడి వలన శరీరంలో కాల్షియం లోపం ఏర్పడుతుంది. ఫలితంగా త్వరగా అలసిపోవడం, ఎముకల్లో బలం తగ్గడం, పెలుసుగా మారడం, జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ వస్తుంటాయి. చలికాలంలో ఇటువంటి బాడీ పెయిన్స్ ఇంకా ఎక్కువగా వస్తుంటాయి.
Knee pains : అన్ని నొప్పులకు ఒకటే మందు..
ఇలాంటి అనారోగ్య సమస్యలకు కొందరు వైద్యుల వద్దకు వెళ్లి మెడిసిన్స్ తీసుకుంటుంటారు. మరికొందరు కాల్షియం టాబ్లెట్లను సప్లిమెంటరీ కింద వాడుతుంటారు. ఇవి కొద్దిసేపు వరకే రిలీఫ్ ఇస్తాయి. ఆ తర్వాత పని ఒత్తిడి పెరిగితే మళ్లీ నొప్పులు తీవ్రతరం అవుతుంటాయి. ఇలాంటి వాటికి టాబ్లెట్స్ తీసుకోవడం కంటే ఆయుర్వేద పద్దతిలో మంచి రెమిడీ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఈ రోజుల్లో చాలా మంది 25 నుంచి 35లోపు వారే మోకాళ్లు, బాడీ పెయిన్స్‌తో బాధపడుతున్నారని తెలుస్తోంది. సాధారణంగా కీళ్లు, మోకాళ్ల నొప్పులు అనేవి నలభై ఏళ్లు దాటిన వారిలోనే అధికంగా వస్తుంటాయి. కానీ ఈ జనరేషన్ వారిలోనూ తక్కువ వయస్సు వారిలోనూ ఇలాంటినొప్పులు రావడం అనేది పోషకాహార లోపమేనని అంటున్నారు.
అందుకోసం 6 బాదం,12 ఫుల్ మఖాన, పావు చెంచా మెంతులు, ఒక చెంచా గసగసాలు, పావు చెంచా పసుపు, పావు చెంచా శొంఠి, దాల్చిన చెక్క ఒకటి ఒక ప్లేట్‌లో పెట్టి కాసేపు వేయించుకుని పొడి చేసుకోవాలి.ఈ పౌడర్ 15రోజుల వరకు చెడిపోకుండా ఉంటుంది. దీనిని రోజు ఒక స్పూన్ పాలు లేదా నీళ్లలో కలుపుకుని తాగాలి. ఖాళీ కడుపుతో తాగితే ఇంకా మంచిదట.. వారం రోజులు ఇలా తాగి మళ్లీ మూడు రోజులు గ్యాప్ ఇచ్చి తాగితే మంచి ఫలితం ఉంటుంది. ఎముకలు దృఢంగా మారతాయి.
Read Also : Curry Leaves Juice Benefits : కరివేపాకు జ్యూస్‌తో రక్తపోటు నియంత్రణ..!