Relationship Problems : ఎన్ని సంబంధాలు చూసినా కొందరికి తొందరగా పెళ్లి కుదరదు. అందుకు అనే సమస్యలు వస్తున్నాయని పలువురు అయ్యవారు చెబుతుంటారు. దీనికి తోడు అనేక శాంతి పూజలు చేయిస్తుంటారు. మరో వైపు పెళ్లయిన కొందరికి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టరు. ఇక వారు తిరగని గుళ్లు, గోపురాలు ఏవీ ఉండవు. ఇలాంటి వారు ఏం చేస్తే వారి దోషాలు తొలగిపోయాయి. అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
మార్గశిర మాసంలో శుక్లపక్షంలో పంచమికి మంచి స్థానముంది. ఈ రోజును వివాహ పంచమిగా హిందువులు భావిస్తారు. ఈ రోజు సీతారాములను పూజిస్తే వివాహా సమస్యలు తొలిగిపోతాయని నమ్మకం. ఈ రోజు కొన్ని పనులు చేస్తే ఫ్యామిలీలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖశాంతులు దరిచేరుతాయని చెబుతుంటారు. ఎవరి వివాహ జీవితంలో సమస్యలుంటే ఈ రోజున పూజలు నిర్వహిస్తే లైఫ్ చాలా సంతోషంగా ఉంటుందని నమ్మకం.

మంచి గుణాలున్న లైఫ్ పార్టర్న్ కోసం ఈ రోజు ఫాస్టింగ్ ఉండాలి. సీతారాములకు పూజలు చేయాలి. తన మంచి లైఫ్ పార్టర్న్ ను ఇవ్వాలని కోరుకోవాలి. ఈ రోజు సీతారాములకు పూజలు చేస్తే వివాహంలో ఏర్పడిన అన్ని అడ్డంకులు తొలిగిపోతాయట. ఆదర్శ దంపతులుగా సీతారాములు పేరు గాంచారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వారు వివాహ పంచమి రోజున రామచరితమానస్‌ను చదవాలి. తమకున్న సమస్యలను తొలగించాలంటూ శ్రీరాముడిని వేడుకోవాలి. దీని వల్ల వైవాహిక జీవితంలో ఎదురయ్యే ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి.
ఈ రోజు రామ్‌చరిత్ మానస్‌ను ఇంట్లో చదవడం వల్ల ఇంట్లో శాంతి చేకూరుతుందని నమ్ముతారు. పెళ్లి అయిన తర్వాత పిల్లలు లేని దంపతులకు ఈ రోజున సీతారాముచంద్రులకు పూజలు చేస్తే వారికి లవకుశల లాంటి పిల్లలు పుడుతారని చెబుతుంటారు. సీతారాములను పూజించే సమయంలో శ్రీరామరక్షా స్తోత్రమును చదవాలి.
Read Also : Coconut Spoiled in Pooja : శుభకార్యంలో ‘కుళ్లిన’ టెంకాయ వస్తే ఏం జరుగుతుందో తెలుసా!