Zodiac Signs : ప్రతి మనిషిలో లీడర్ లక్షణాలు ఉండటం కామన్.. కానీ సందర్భాలను బట్టి అవి కనిపిస్తూ ఉంటాయి. కానీ కొంత మంది బై బర్త్ లీడర్స్‌గా ఉంటారు. వారు వేసే ప్లాన్స్, తదితరు విషయాలను బట్టి వారిని బార్న్ లీడర్స్‌గా పిలుస్తారు. అయితే జోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులకు చెందిన వారు ఇలాగే ఉంటారట.. మరి ఆ రాశివారు ఎవరో తెలుసుకుందామా..?
మేషరాశికి చెందిన వారు పుట్టుకతోనే లీడర్లు. వీరు చేసే ప్రతి పనిలోనూ దీనిని గుర్తించవచ్చు. వారి మాటలతో ఇతరులను ఇట్టే కట్టిపడేస్తుంటారు. ప్రతి విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. ప్రతి పనిని భిన్నంగా చేసేందుకు వీరు ఆసక్తి చూపుతారు. ఇక వృశ్చిక రాశికి చెందిన వారు చాలా మొండితనం కలిగి ఉంటారు. వీరు ఏది చెబితే అదే నిజం అన్న తీరులో ఇతరులను నమ్మిస్తారు. ఇక ఏదైనా పనిని పూర్తి చేయాలని డిసైడ్ అయితే.. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని కంప్లీట్ చేసి తీరుతారు. ఈ రాశికి చెందినవారు చాలా నిజాయితీగా వ్యవహరిస్తారు. వీరికి కోపం కూడా ఎక్కువే.
ఇక కుంభరాశికి చెందిన వారు చాలా ఆచరణాత్మకంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఓ నిర్ణయం తీసుకునే ముందు చాలా ఆలోచిస్తారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తుంటారు. వచ్చే ప్రమాదాన్ని ముందే పసిగట్టి ముందుగానే సలహాలు, సూచనలు ఇస్తారు. వీరి తెలివిని, సామర్థ్యాలను ఎదుటి వారు మెచ్చుకోకుండా ఉండలేరు. మకర రాశికి చెందిన వారు ఏ విషయానైనా పూర్తిగా ఆలోచిస్తారు. వీరి ఏది చెబితే అదే నిజం అని ఇతరులు భావించాలి అని అనుకుంటూ ఉంటారు. వీరిని ఎవరూ ఎదురించలేరు. మరి ఇందులో మీ రాశి ఉందా? మీరు ఇవే లక్షణాలను కలిగి ఉన్నారా? ఓ సారి చెక్ చేసుకోండి..
Read Also : Vivah Panchami Vratham : పెళ్లి త్వరగా కావాలంటే ‘వివాహ పంచమి’వ్రతం ఆచరించండి.. మీ కష్టాలు తీరినట్టే..?