Negative Energy Bathroom : మీ ఇంట్లో తరచూ గొడవలు అవుతున్నాయా? చిన్నదానికి కోపం వస్తుందా? ఇంట్లో వాళ్లతో చిరాకు పడుతున్నారా? అయితే మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉన్నట్టే.. ఈ సమస్యను వెంటనే తొలగించి పాజిటివ్ ఎనర్జీతో నింపేయాలి.. వాస్తు శాస్త్రంలో నెగటివ్ ఎనర్జీని ఎలా తరిమికొట్టాలో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయి.. అవేంటో ఓసారి చూద్దాం..
ఇంట్లో అంతా పాజిటివ్ గా ఉన్నప్పుడు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది.. ఇదే పాజిటివ్ ఎనర్జీ ఉందనడానికి సంకేతం.. అలానే చిరాకు, కోపం వంటి అనిపిస్తే మాత్రం నెగటివ్ ఎనర్జీ ఉందని అర్థం..
ఈ చిట్కాల ద్వారా ఇంట్లో దాగిన నెగటివ్ ఎనర్జీ ఎక్కడ ఉందో గుర్తించి తొలగించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సిందిల్లా.. మొదటగా బాత్ రూమ్ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంట్లో నెగటివ్ ఎనర్జీకి బాత్ రూమ్స్ కారణం కావొచ్చు. ఇంట్లో ప్రతి గదిని శుభ్రంగా ఉంచుకోవాలి.
ముఖ్యంగా బాత్ రూంలో ఎలాంటి మార్పులు చేయాలి. అది కూడా వాస్తుప్రకారమే చేయాలి.. బాత్ రూం ఎప్పుడూ నీటుగా పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. సువాసన వెదజల్లేలా ఏదైనా పర్ ఫ్యూమ్ ఉంచాలి. తద్వారా మనస్సుకు ప్రశాంతంగా అనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు కూడా దరిచేరవు. బాత్ రూం పరిశుభ్రంగా ఉంటేనే ఆరోగ్యం బాగుంటుంది. ఎప్పటికప్పుడూ బాత్ రూంను శుద్ధి చేసుకుంటుండాలి. మంచి సువాసనలు వెదజల్లేలా ఏదైనా సుగంధ ద్రవ్యాలను ఉంచుకోవాలి. అప్పుడు బాత్ రూంలో పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి.
ఫలితంగా నెగటివ్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఇల్లు మొత్తం ఆహ్లాదకర వాతావరణంగా మారిపోతుంది. చాలా మంది చేసే తప్పు ఏంటంటే?.. ఇంటిని శుభ్రంగా చేసుకుంటారు.. బాత్ రూం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుంటారు. అలా ఎప్పటికీ చేయకూడదు.. మనం చేసే మల, విసర్జన వంటివి బాత్ రూంలోనే.. అది ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. వాస్తు ప్రకారం.. బాత్ రూంలో ఏయే వస్తువులను ఉంచుకోవాలో తెలుసుకోవాలి.
వాస్తు ప్రకారం.. బాత్రూంలో అద్దం తూర్పు వైపు ఉండాలి. అప్పుడు చాలా మంచి జరుగుతుంది. అపశవ్య దిశలో అద్దాన్ని పెడితే మాత్రం వెంటనే తీసేయండి.. తూర్పు గోడకు తగిలించండి. లేదంటే నెగటివ్ ఎనర్జీ పెరిగిపోతుంది. వాటర్ క్లోసెట్ ఉత్తర దిశ, దక్షిణ దిశగా ఉంచుకోవాలి. అలాగే నీటి కుళాయిలు ఈశాన్య, వాయువ్య దిశలోనే ఉండేలా చూసుకోవాలి.
బాత్ రూంలో ఇలాంటి మార్పులు గానీ చేశారంటే.. అతి తొందరలోనే మీ ఇంట్లోనే నెగటివ్ ఎనర్జీ అంతా వెళ్లిపోతుంది.. పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. ఇంట్లో అంతా ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఇంకెందుకు ఆలస్యం.. మీ ఇంట్లో బాత్ రూంలో కూడా ఏమైనా నెగటివ్ ఎనర్జీని జనరేట్ చేసేలా ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి.. బాత్ రూంను చక్కగా మార్చేసి సువాసనలతో నింపేయండి.. పాజిటివ్ ఎనర్జీని పెంచుకోండి.
పాజిటివ్ ఎనర్జీని గుర్తించడం చాలా సులభమే.. వంటింట్లో దొరకే వస్తువులతో ఈజీగా నెగటివ్ ఎనర్జీని నివారించుకోవచ్చు. ఇంట్లో దాగిన నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీతో నిండిపోవాలంటే పైనచెప్పిన విధంగా పాటిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఇంట్లో అద్దం లేదా గోడ గడియారం కూడా సరైన దిశలో ఉండేలా చూసుకోవాలి. అప్పుడే ఇంట్లో నెగటివ్ ఎనర్జీని పూర్తిస్థాయిలో బయటకు వెళ్లగొట్టడం జరుగుతుంది.
Read Also : COVID-19 Recovery Home Exercises : ఈ వ్యాయామాలు చేస్తే కరోనా రాదట.. వచ్చినా వెంటనే కోలుకోవచ్చు!