Nakshatra Plants : తెలుగు నాట ప్రజలు నక్షత్రాలను ఎక్కువగా నమ్ముతారు. ఎవరికైనా పెళ్లి చేయాలని చూసినపుడు నక్షత్రాలంటేని తప్పకుండా అడుగుతారు. పూర్వకాలం నుంచే మన తెలుగు వారు నక్షత్రాలను ఎక్కువగా నమ్ముతారు. కొన్ని రకాల నక్షత్రాల వారు వివిధ రకాల మొక్కలను నాటితే శుభాలు జరుగుతాయని ప్రతీతి. అసలు ఏ నక్షత్రం వారు ఏ రకమైన మొక్కను నాటితే మంచిదనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. అశ్విని నక్షత్రం వారు జీడి మామిడి, భరణి నక్షత్రం వారు దేవదారు చెట్టు, కృత్తిక నక్షత్రం వారు మేడి చెట్టు నాటడం మంచిదని మన శాస్త్రాలు చెబుతున్నాయి.
ఇక రోహిణి నక్షత్రం వారి విషయానికి వస్తే నేరేడు చెట్టు, మృగశిర నక్షత్రం వారు మారేడు చెట్లను నాటితే మంచిదట. ఆరుద్ర నక్షత్రం ఉన్న ప్రజలు చింత చెట్టును, పునర్వసు నక్షత్రం ఉన్న ప్రజలు గన్నేరు చెట్టును నాటాలి. పుష్యమి నక్షత్ర జనాలు పిప్పలి చెట్టును, ఆశ్లేష నక్షత్రం ఉన్న ప్రజలు బొప్పాయి చెట్టును నాటడం మంచిదట. మఖ నక్షత్రం వారు మర్రి చెట్టు, పుబ్బ నక్షత్రం ఉన్న వారు మోదుగ చెట్టును నాటాలి. ఉత్తర నక్షత్రం వారు జువ్వి చెట్టుని, హస్త నక్షత్రం వారు కుంకుడు చెట్టును నాటాలి.

చిత్త నక్షత్రం వారు తాడి చెట్టును, స్వాతి నక్షత్రం వారు మద్ది, విశాఖ నక్షత్రం వారు మొగలి చెట్టును నాటితే దోషాలు పోతాయని జ్యోతిష్యులు నమ్ముతున్నారు. అనురాధ నక్షత్రం వారు పొగడ, జ్యేష్ఠ నక్షత్రం వారు కొబ్బరి, మూల నక్షత్రం వారు వేగి, పూర్వాషాడ నక్షత్రం వారు నిమ్మ, ఉత్తరాషాడ పనస, శ్రవణం జిల్లేడు, ధనిష్ఠ జమ్మి, శతభిషం అరటి, పూర్వాభద్ర మామిడి, ఉత్తరాభాద్ర వేప, రేవతి నక్షత్రం వారు విప్ప మొక్కని నాటడం మంచిది.
Read Also : Spinach Breakfast : చలికాలంలో ఈ బ్రేక్ ఫాస్ట్ తప్పక తినాల్సిందే.. హెల్త్‌కు చాలా మంచిది తెలుసా?