Moles Meaning : పుట్టుమచ్చలు మనం పుట్టగానే పుడతాయి. కొంత మందిలో ఈ పుట్టు మచ్చలు పుట్టిన తర్వాత కూడా ఏర్పడతాయి. ఈ పుట్టు మచ్చల వలన అదృష్టం కలిసి వస్తుందని కొంత మంది చెబుతుంటే లేదు దురదృష్టం వెంటాడుతుందని కొందరు పేర్కొంటున్నారు. శరీరంలోని వివిధ భాగాల్లో ఉన్న పుట్టు మచ్చల వలన ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని పాత రోజుల నుంచి మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. వాటి గురించి ఒక్క సారి పరిశీలిస్తే.. కడుపు మీద పుట్టుమచ్చ ఉన్న వ్యక్తులు స్వార్థపూరితమైన వ్యక్తులుగా ఉంటారని ప్రతీతి.
వారు ఎవరి గురించి పట్టించుకోరని అనేక మంది చెబుతూ ఉంటారు. నోటి దగ్గర పుట్టు మచ్చ ఉన్న పురుషులు గొప్ప సంపదని మరియు ఆనందాన్ని కలిగి ఉంటారని ప్రతీతి. అంతే కాకుండా వారు చాలా ఆనందంగా కూడా జీవిస్తారట. అలాగే మహిళలకు నోటి దగ్గర పుట్టు మచ్చ ఉంటే వారు చాలా చురుగ్గా ఉంటారని చెబుతున్నారు. కుడి చెంప మీద పుట్టు మచ్చ ఉన్న పురుషులు చాలా ఉద్వేగభరిత వ్యక్తులుగా ఉంటారని, మరియు కుడి చెంప మీద పుట్టు మచ్చ ఉన్న మహిళలు భర్తతో చాలా ఆనందంగా గడుపుతారని ప్రతీతి.
కానీ ఎడమ చెంప మీద పుట్టు మచ్చ ఉన్న పురుషులు ఆర్థిక ఇబ్బందులను కలిగి ఉంటారని అర్థం. అలాగే ఎడమ చెంప మీద పుట్టు మచ్చను కలిగి ఉన్న మహిళలు మానసిక వ్యాకులతను కలిగి ఉంటారట. అదే సమయంలో ఎడమ రొమ్ము కింద పుట్టు మచ్చ ఉన్న స్ర్తీలు చేసే ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారని, అంతే కాకుండా మంచి హాస్య చతురతను కలిగి ఉంటారని అర్థమట. అదే సమయంలో కుడి రొమ్ము కింద పుట్టు మచ్చ ఉన్న పురుషులు లేదా స్త్రీలు చాలా ఆనందంగా జీవిస్తారట.
Read Also : Shiva Puja : పెళ్లి కాని యువతులు శివలింగాన్ని పూజించవచ్చా..? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి..!