Shiva Puja : పరమేశ్వరుడిని తమ భక్తులు చాలా పేర్లతో పిలుచుకుంటారు. సర్వేశ్వర, శివ, పరమేశ్వర, జంగమదేవుడా, రాజేశ్వర, కేదారేశ్వర ఇలా ఎవరికి తోచినట్టు వారు పిలుస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటారు. శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు సోమవారం. ఈ రోజున మహిళలు, యువతలు ఉపవాసం ఉంటారు. తలంటూ స్నానం చేసి పరమ శివుడి ఆశీర్వాదం పొందేందుకు నిష్టతో పూజలు చేస్తుంటారు.
అయితే, వీరంతా ఇంట్లో ఉండే శివుడి చిత్రపటానికి పూజలు చేస్తుంటారు. కానీ గుడికి వెళితే అక్కడ శివుడి విగ్రహం ఉండదు. శివలింగం మాత్రమే ఉంటుంది. అయితే, పెళ్లికాని యువతులు శివలింగాన్ని పూజించరాదని కొందరు అంటున్నారు. హిందూ శాస్త్రం ఏం చెబుతోంది. ఒకవేళ యువతులు శివలింగాన్ని పూజిస్తే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం..
Shiva Puja _ Can unmarried girls not offer water or touch Shivlingచాలా మందికి శివలింగం మహిమ, దాని విశేషాల గురించి ఎవరికి తెలియకపోవచ్చు. శివలింగం అనగా దేవుడి రూపంలో ఉండే రాయి మాత్రమే కాదు. అది మూల్లోకాధిపతులను సూచిస్తుంది. శివలింగం కింద భాగం ‘బ్రహ్మదేవుని’స్వరూపం. మధ్య భాగం ‘శ్రీ మహా విష్ణువు’రూపం, పై భాగం ‘త్రినేత్రుడి’రూపంగా పిలుస్తారు. అయితే, లింగం కింద భాగాన్ని ‘యోని’ అని పిలుస్తారని.. ‘యోని-లింగం’అనేది సంగమమైన శివలింగాన్ని విశ్వసానికి ప్రతీకగా భక్తులు కొలుచుకుంటారు. అనగా ‘సమస్త విశ్వం’ పుట్టుక, చావు, స్త్రీ ఫురుషుల సంగమం వంటి ఇందులోనే దాగి ఉంటాయని శాస్త్రాలు చెబుతున్నాయని తెలుస్తోంది.
హిందూ పురణాల ప్రకారం శివుడు లింగంలో కొలువుదీరి ఉంటాడు. శివలింగం అనగా నాశనం లేనిదని అర్థం. అయితే, శివలింగంలో పరమేశ్వరుడు ధ్యానరూపంలో ఉంటాడని, పెళ్లి కాని యువతులు లింగాన్ని పూజించే బదులు పార్వతీ పరమేశ్వరులు జంటగా ఉన్న చిత్రాన్ని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందట.. అర్థనారీశ్వడు పెళ్లి కానీ యువతులకు తన ఆశీర్వాదాలను ఇస్తాడని కొందరు పండితులు సెలవిచ్చారు. 16 సోమవారాలు ఉపవాసంతో ఉండి నిష్టగా నిష్టగా శివుడిని ఆరాధిస్తే త్వరగా పెళ్లి జరుగుతుందని, సుఖశాంతులతో ఉంటారని కొందరు భక్తుల ప్రగాఢంగా నమ్ముతున్నారు.