Karthika Masam 2021 : ఇతర మాసాలతో పోలిస్తే కార్తీక మాసానికి ఆధ్యాత్మికంగా బాగా ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో శివుడిని పూజించేందుకుగాను శైవాలయాలకు భక్తులు పోటెత్తుతుంటారు. పరమ శివుడికి అత్యంత ప్రీతి పాత్రమైన ఈ మాసంలో పూజలు చేయడం వల్ల మనుషులందరూ ఆరోగ్యంగా ఉంటారు.
ఈ మాసంలో బంధుమిత్రులందరూ చక్కగా ఆనందంగా సమ్మేళనాలు జరుపుకోవడంతో పాటు వన భోజనాలకు వెళ్తుంటారు. ఇకపోతే అందరూ కలిసి హ్యాపీగా వనభోజనాలకు వెళ్తుంటారు. కాగా, ఈ క్రమంలోనే అందరు ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తుంటారు. ఇలా ఈ చెట్టు కిందనే భోజనం చేయడానికి గల కారణాలు మీకు తెలుసా.. జనరల్‌గా ఉసిరికాయల వల్ల ఆరోగ్యానికి కలిగే మేలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది.
క్షమాగుణానికి ప్రతీకగా ఉసిరి చెట్టును పిలుస్తుంటారు. ధాత్రి చెట్టు అని కూడా ఉసిరిని పిలుస్తుంటారు. ఈ చెట్టు లక్ష్మీ స్వరూపం కూడా. పురణాల ప్రకారం లక్ష్మీ దేవి ఎక్కడుంటే విష్ణుమూర్తి కూడా అక్కడే ఉంటాడు. అందుకే మన పెద్దలు ఉసిరి చెట్టు దగ్గర భోజనం చేయాలని చెప్తుంటారు. క్షమాగుణానికి ప్రతీక అయిన ఉసిరి చెట్టు కింద భోజనం చేయడం వల్ల మనిషి ఆరోగ్యంగా ఉంటాడని వివరిస్తున్నారు పెద్దలు. పరబ్రహ్మ స్వరూపం అయినటువంటి ఆహారం ముందర అందరూ సమానమని చెప్పడమే వన భోజనాల ఉద్దేశమని పెద్దలు పేర్కొంటున్నారు.
ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తే కనుక అది స్వామి వారి ప్రసాదంగాగానే భావించబడుతుందట. అందుకే ఉసిరి చెట్టును ప్రజలు దేవుడిలా పూజిస్తుంటారు. ఇకపోతే పిక్నిక్ మాదిరిగా అలా వనభోజనాలకు వెళ్లి ప్రజలంతా హ్యాపీగా పచ్చటి ప్రకృతి వాతావరణంలో కొద్ది సేపు సేద తీరి ఎంజాయ్ చేయొచ్చు. ఉసిరి చెట్టు కింద భోజనం చేయడంతో పాటు మహా విష్ణువుకు పూజ చేస్తే అశ్వమేధ యాగం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందట.
కార్తీకమాసంలో శివుని ఆరాధన చాలా ప్రాముఖ్యమైనదిగా చెబుతారు. అలాంటి కార్తీక మాస సమయంలో శివునితోపాటు శ్రీమన్నారాయణుడికి కూడా పూజలు చేయాలి. కార్తీక మాసంలో ప్రత్యేకంగా చెప్పబడిన అంశం.. చెట్ల కింద వనభోజనాలకు వెళ్లడం.. ఇది చాలా సంప్రదాయ పద్ధతిలో అందరూ ఒకేచోట కలిసి భోజనం చేయడం అనేది అనాధిగా వస్తోంది. పురాణాల్లో కూడా చెట్లకిందకు వెళ్లడంపై అనేక కథలు ఉన్నాయి.
ప్రత్యేకంగా ఉసిరి చెట్టు కిందకు ఎందుకు వెళ్తారో కూడా మహా పండితులు చక్కగా వివరణ ఇచ్చారు. ఉసిరి అంటే.. లక్ష్మీదేవి.. లక్ష్మీనారాయణుడి స్వరూపంగా కొలుస్తారు. అందుకే ఉసిరి చెట్లును దేవతగా పూజిస్తారు. చెట్టుకు పసుపు, కుంకమతో పూజించి దీప నైవేద్యాలను సమర్పించి పూజలు చేస్తారు. ప్రదక్షిణులు చేసి సకల సంపదలు, ఆరోగ్యాన్ని ప్రసాదించమని కోరుతారు.
కార్తీక మాసంలో విశిష్టంగా చెప్పబడిన ఈ ఉసిరిచెట్టు ఉద్యానవనానికి చాలా ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి. అందరూ కలిసి సూర్యోదయానికి ముందే నిద్రలేసి తలస్నాన్నాలు ఆచరించి ఇంట్లో పూజలు చేసుకుంటారు. ఇంట్లో అందరూ కలిసి పట్టువస్త్రాలు ధరించి చెట్లకు కిందకు వనభోజనాలకు వెళ్తుంటారు. కార్తీక మాసంలో ఇలా వనభోజనాలకు వెళ్లడం ద్వారా అంతా మంచి జరుగుతుందని, లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.. అందరూ కలిసి ఒకేచోట భోజనం చేయడం ద్వారా అందరూ ఒక్కటే అనే విషయాన్ని లోకానికి చాటిచెప్పవచ్చు.
Read Also : Karthika Masam 2021 : కార్తీక మాసంలో పరమశివుడికి ఇలా పూజ చేస్తే ..సకల లాభాలు..