Karthika Masam 2021 : నీలకంఠుడికి కార్తీక మాసంలో పూజలు చేస్తే చక్కటి ప్రయోజనాలు కలుగుతాయని పండితులు చెప్తున్నారు. ముఖ్యంగా కార్తీక మాసంలోని సోమవారాలలో చేసే పూజల వల్ల ప్రతిఫలాలు తప్పక దక్కుతాయి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి శివుడిని ఆ రోజున రకరకాల పదార్థాలతో అభిషేకిస్తుంటారు.
అభిషేకాలు చేయడం ద్వారా శివుడు సకల సంపదలను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. కార్తీక మాసంలోని తొలి సోమవారం మాత్రమే కాదు మిగతా సోమవారాలలోనూ భక్తులు నిష్టగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేయాల్సి ఉంటుంది. అలా చేయడం ద్వారా వారి కోరికలు తప్పక నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శివుడిని ఏయే పదార్థాలత పూజించాలో తెలుసుకుందాం.
ఆవు పాలను నైవేద్యంగా సమర్పించడం వల్ల చాలా లాభాలున్నాయి. ఎవరైతే ఆవుపాలను నైవేద్యంగా పెడతారో వారి సర్వ దు:ఖాలు తొలగిపోతాయి. ఏదేని అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారు అయినా శివుడికి ఆవు పాలు సమర్పించొచ్చు. అలా వారు పాలు సమర్పిస్తే కనుక వెంటనే ఆరోగ్యవంతులవుతారని పెద్దలు చెప్తున్నారు.
గంగాజలాన్ని భోళా శంకరుడికి సమర్పిస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయి. శివుడిని ఆరాధించే క్రమంలో గంగకు ఉన్న ప్రయారిటీ అందరికీ తెలిసే ఉంటుంది. శివుడికి గంగాజలం అంటే అత్యంత ప్రీతి కాగా, గంగాజలం సమర్పించినంత మాత్రానే మీ దోషాలన్నీ తొలగిపోతాయి. అన్ని దోషాలు పోయి మీకు సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, సౌభాగ్యం లభిస్తాయి.
ఇక కాలసర్ప దోషం, శని సంబంధిత దోషాలు ఉన్న వారు శివ ధ్యానం చేస్తే చక్కటి ప్రయోజనాలుంటాయి. వారు అలా చేస్తే చాలు వెంటనే దోషాలన్నీ తొలగిపోతాయి. శివుడికి ఈ కార్తీక మాసంలో చేసే పూజల మిగతా సమయాల్లో చేసే పూజల కంటే శ్రేష్టమైనవని, వీటి వల్ల చాలా ప్రయోజనాలుంటాయని పండితులు వివరిస్తున్నారు.
కార్తీకమాసం అనగానే అందరికి గుర్తుచ్చేది శివనారాయణుల పూజ.. భక్తులంతా కార్తీకమాస స్నానాలను ఆచరించి భక్తిశ్రద్ధలతో శివనాారాయణులను పూజిస్తుంటారు. కార్తీకమాసంలో ప్రత్యేకించి శివారాధన చాలా మంచిది. శివాభిషేకం, రుద్రాభిషేకం వంటివి చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు. శంకరుడి ఆశీస్సులతో పాటు సకల దోషాలను పొగట్టుకోవచ్చు.
ఈ పర్వదినాన స్వామివారిని బిల్వదళాలతో ఆర్చించిన యెడల సకల దోషాలు తొలగి ఆయూరారోగ్యాలతో సంతోషంగా వర్ధిల్లుతారు. కార్తీక మాసంలో శివునికి ఎంతో ప్రీతికరమైన బిల్వదళాలు, పంచాముత్రంతో పూజించాలి. శివధాన్యం కూడా గొప్పది. శివరాత్రి వంటి పర్వదినాల్లో జాగారం చేయడం ద్వారా శివుని అనుగ్రహం పొందవచ్చు.
శివుడు.. ఆయన బోళా శంకరుడు. అలాగే నిరాండబరుడు. శివలింగం ఎప్పుడూ నీటితో జాలువారుతుండాలి. శివునికి అభిషేకం అంటే చాలా ఇష్టం. అందుకే శివలింగానికి అభిషేకం చేయాలంటారు. బిల్వపత్రాలతో పాటు నీళ్లు, పాలు, తేనె, పంచదార, పూలు, పండ్లు, గంధం, విభూతితో స్వామివారిని అలకరించి అభిషేకం చేయాలి.
శివలింగ ఆరాధన ద్వారా మీలో తీరని కోరికలు ఏమైనా ఉన్నా వెంటనే తీరిపోతాయట. శివుని అనుగ్రహం తొందరగా దొరకుతుందని చెబుతుంటారు పండితులు. కార్తీక మాసంలో శివరాధన చాలా గొప్పది. శివునికి పూజ చేయడం ద్వారా సకల సంపదలు, సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చు.
Read Also : Ayurveda Tea Benefits : ఆయుర్వేద ‘టీ’తో జీర్ణక్రియ సమస్యలకు చెక్.. కాంతివంతమైన చర్మం మీ సొంతం..