Garuda Puranam : పూర్వం హిందూ ధర్మాన్ని ఆచరించే వారు ఎక్కువగా గరుడపురాణాన్ని ఫాలో అయ్యేవారు. అందులోని విషయాలు సాక్ష్యాత్తు శ్రీ మహావిష్ణువే చెప్పినట్టుగా భావించేవారు. మనిషి తన జీవితంలో మంచి చేస్తే ఏమవుతుంది. తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు విధిస్తారని అందులో పేర్కొన్నారని నేటికీ కొందరు నమ్ముతారు. మరికొందరు లైట్ తీసుకుంటారు. కానీ సనాతన ధర్మాన్ని పాటించే వారు మాత్రం గరుడ పురాణంలో చెప్పిన అంశాలను తూచ తప్పకుండా ఇప్పటికీ పాటించేవారు ఉన్నారు.
ప్రస్తుత సమాజంలో కొందరు పాశ్చాత్య సంస్కృతికి అలవాటు పడి అదే సరైన జీవన విధానం అని భావిస్తున్నారు. అందువల్ల ఇంట్లోని పెద్దవారిని గౌరవించకపోవడం, ఇతరులతో అ గౌరవంగా ప్రవర్తించడం, ప్రతీ చిన్న విషయానికి తమదే నడవాలని పట్టుబట్టడం, గొడవలు చేయడం కొందరికీ పరిపాటిగా మారింది.

Garuda Puranam : ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే…
అలాంటి వ్యక్తుల ఇంట్లో ఎల్లప్పుడూ అశాంతి, ఆర్థిక ఇబ్బందులు, గొడవలు తలెత్తే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది. అయితే, గరుడ పురాణంలో చెప్పిన ప్రకారం.. ఈ మూడు విషయాల్లో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరాదట… లేనియెడల కొత్త సమస్యలను కొని తెచ్చుకున్నట్టే అని అంటున్నారు సనాతనధర్మాన్ని ఆచరిస్తున్న వారు.
భోజనం చేశాక వంట పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలట.. రాత్రి సమయంలో వంటగదిని మొత్తం శుభ్రం చేసే పడుకోవాలి. మురికి పాత్రలు రాత్రి ఉంచరాదు. అలా చేస్తే ఇంట్లో గొడవలు చాలా అవుతాయని గరుడపురాణంలో ఉందని చెబుతున్నారు. అదే విధంగా మనం నివసిస్తున్న ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. లేనియెడల లక్ష్మీ కాటాక్షం ఉండదు.
దీంతో అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అప్పుల పాలు అవుతారట.. చివరగా ఇంట్లో వ్యర్థ పదార్థాలను ఎక్కడ పడితే అక్కడ ఉంచరాదు. ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి.లేనియెడల వ్యక్తులపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. అనారోగ్యం పాలవుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ మూడు అంశాలను తప్పకుండా పాటిస్తే ఆ ఇంట్లోని వారంతా ఆరోగ్యంగా, సుఖ శాంతులతో ఉంటారట..
Read Also : Lemon Coffee Benefits : నిమ్మకాయ కాఫీతో ఇన్ని ప్రయోజనాలా? రుచిలోనే కాదు ఆరోగ్యానికి ది బెస్ట్!