Lemon Coffee Benefits : ఉదయం లేవగానే కొందరికి టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉంటుంది. అవి లేకపోతే వారికి రోజు గడువదు. మరికొందరికీ పేపర్ చదివే అలవాటు ఉంటుంది. ఒక్కరోజు వీటిలో ఏది మిస్ అయినా వారు రోజంతా ఫీలవుతారు. ఎందుకంటే రోజువారీగా వాటికి అంతలా అలవాటు పడిపోయి ఉంటారు. అయితే, ఇటీవల చాలా మందికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. అందుకోసం టీ బదులు కొందరు (Lemon Coffee Benefits ) లెమన్ టీ, డికాషన్, హనీ టీ, గ్రీన్ టీ లాంటి వాటిని అలవాటు చేసుకుంటున్నారు.
కరోనా సమయంలో చాలా మంది కషాయం తీసుకోవడం తమ డైలీ రౌటీన్‌లో భాగంగా చేసుకున్నారు. పై వాటన్నింటిలో ఎంతో కొంత ఆరోగ్యానికి మేలు చేసే మూలకాలు ఉంటాయి. అయితే, నిమ్మకాయ కాఫీ తాగడం వలన ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుందని, అధిక బరువు, కొలెస్ట్రరాల్‌ను తగ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని మీలో ఎంత మందికి తెలుసు..

అధిక బరువు, కొలెస్టరాల్‌కు నిమ్మరసం-కాఫీతో చెక్.. :
ప్రస్తుత రోజుల్లో చాలా మంది తినడం, కూర్చోని ఆఫీసు పనులు చేస్తుండటం, తిన్న వెంటనే టీవీ ముందు కూర్చోవడంతో అధిక బరువు పెరుగుతున్నారు. వర్కౌట్స్ కూడా చేయకపోవడంతో చాలా మంది ఓవర్ వెయిట్ గెయిన్ అవుతున్నట్టు తెలుస్తోంది. వీటికి నిమ్మకాయరసం కాఫీతో చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
అధిక బరువు తగ్గించడంలో కాఫీ, నిమ్మకాయ రసంతో తయారు చేసిన మిశ్రమం చాలా బాగా పనిచేస్తుంది. కాఫీలో ఉండే కెఫిన్ జీవక్రియను ఫాస్ట్‌గా పనిచేసేలా చేస్తుంది. నాడీ కేంద్రాన్ని మేల్కొలుపుతుంది. దీంతో మానసిక స్థితితో పాటు చురుకుదనం మెరుగవుతుంది. నిమ్మకాయలు సంపూర్ణతను ప్రోత్సహిస్తాయి. సీ విటమిన్ వలన శరీరానికి శక్తి చేకూరుతుంది. ఫ్రీ రాడికల్స్ వలన కలిగే నష్టాన్ని నియంత్రిస్తాయి.
నిమ్మకాయ, కాఫీ రెండూ బెస్ట్ హెల్త కేర్స్. ఇవి కొవ్వును కరిగించవు. కానీ, కాఫీ నిమ్మరసంతో చేసిన జ్యూస్ తగడం వలన ఆకలి తగ్గి జీవక్రియ వేగవంతంగా మారుతుంది. దీంతో అధిక బరువు తగ్గే ఆస్కారం ఉంది. నిమ్మరసం కాఫీ వలన తలనొప్పి తగ్గుతుంది.

నిమ్మకాయటీ కూడా తాగవచ్చు. అలాగే గ్రీన్ టీ కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఆరోగ్య పరంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయం లేవగానే గ్రీన్ టీ తాగడం ద్వారా శరీరంలో వ్యర్థాలను బయటకు పంపివేస్తుంది. ఆ రోజుంతా చురుకుగా అనిపిస్తుంది. జీర్ణక్రియ కూడా మెరుగువుతుంది. అధిక బరువుతో బాధపడేవారికి ఈ టీ కూడా మంచి ఉపశమనంగా పనిచేస్తుంది.
నిమ్మకాయ కాఫీ మాదిరిగా ఈ టీలలో కూడా మంచి పోషక లవణాలు ఉన్నాయి. అందులో ఈ (Lemon Coffee) కాఫీ కూడా ఒకటి.. రుచితో పాటు ఆరోగ్యకర ప్రయోజనాలు కూడా చాలానే ఉన్నాయి. శరీరంలో శక్తిని కోల్పోయి నీరసంగా ఉన్నవారికి నిమ్మకాయ కాఫీ అద్భుతంగా పనచేస్తుంది. నిమ్మకాయ కాఫీని ప్రతిరోజు ఒక అలవాటుగా మార్చుకోవడం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అధికబరువుకు ఈ నిమ్మకాయ కాఫీ దివ్యౌషధంగా పనిచేస్తుంది.
Yoga for Pimples Acne : ఈ ఆసనాలు వేయండి.. మొటిమలు ఇక మాయమే..!