Garuda Puranam : తెలిసో, తెలియకో జీవితంలో చాలా మంది తప్పులు చేస్తుంటారు. అందులో కొన్ని అవసరాన్ని బట్టి ఉండొచ్చు. మరికొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల కావొచ్చు. అయితే ఏయే తప్పులు చేస్తే మరణించాక ఎలాంటి శిక్షలు అనుభవిస్తారో గరుడ పురాణంలో ఉన్నాయి. ప్రజలను ధర్మం వైపు నడిపించడమే ఈ గరుడపురాణం ఉద్దేశం. జీవిత కాలంలో మని చేసే పాపాలు, పుణ్యాలే మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తామా? లేక నరకానికా వెళ్తామా? అని ఇందులో ఉన్నాయి.

ఇక ఘోరాతిఘోరమైన పనులు, తప్పులు చేస్తే చినపోయాక నరకంలో అనేక శిక్షలు అనుభవించాల్సి వస్తుందని ఇందులో ఉంది. ఈ మహాపురాణంలో ప్రస్తావనకు వచ్చి అంశాలు అన్నీ.. విష్ణుమూర్తి నోటి వెంట వచ్చినవే. ఒకానొక సందర్భంలో గరుడ పక్షి అడిగిన ప్రశ్నలకు విష్ణుమూర్తి సమాధానం ఇచ్చాడు. వాటినే ఇందులో పొందుపరిచారు.
గర్భిణీని, శిశువును, పిండాన్ని చంపడం పెద్దపాపామట. అలాంటి వారు చనిపోయాక అనేక శిక్షలకు గురవుతారు. స్త్రీలను అవమానించడం, తిట్టేవారు, గర్భిణులు లేదా రుతుక్రమం సమయంలో ఉన్న వారిని హేలన చేయడం చేసినా, వారితో అసభ్యంగా ప్రవర్తిస్తే అలాంటి వారి జీవితాలు నాశనమవుతాయని గరుడ పురాణం చెబుతున్నది. అలాంటి వారు చనిపోయిన తర్వాత నరకంలో చాలా కఠిన శిక్షలు అనుభవిస్తారట. బలహీనులను, ముసలివారిని, పేదలను వేధించడం, వారిని దోచుకునే వారు సైతం నరకంలో అనేక కఠినమైన శిక్షలు అనుభవిస్తారు.
స్నేహితుడి విషయంలో, ఇతర స్త్రీను దురుద్దేశంతో ఏదైనా చేయాలని భావించిన వాళ్లకు, స్త్రీలను దోపిడీ చేయాలని భావించేవాళ్లకు, స్త్రీతో తప్పుడుగా ప్రవర్తించిన వారికి నరకములో కఠిన శిక్షలుంటాయట. అలాగే ఆలయాలను, మత గ్రంథాల గురించి ఎగతాళిగా మాట్లాడితే వారు పాపుల మాదిరి పరిగణించబడతారు. ఇలాంటి వారు చనిపోయిన తర్వాత నరకానికి వెళ్లి అనేక శిక్షలు అనుభవిస్తారని ఈ పురానం చెబుతుంది.
Read Also : Garuda Puranam : గరుడ పురాణం ప్రకారం.. ఈ 3 పనుల్లో నిర్లక్ష్యం అస్సలు పనికిరాదట.. లేకపోతే అంతే సంగతులు..!