Coconut Spoiled in Pooja : మనదేశంలో చాలా మంది ఇప్పటికీ ఆచార సంప్రదాయాలు, సెంటిమెంట్స్, అపశకునాలు, మంత్రాలు, మూఢ నమ్మకాలను నమ్మేవారు చాలా మందే ఉన్నారు. ఒక్కరని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే భారతీదేశం సనాతన ధర్మం పునాదుల పెరిగి ఇంత ఎత్తుకు ఎదిగింది. టెక్నాలజీ పరంగా దేశం ఎంత అభివృద్ధి సాధించిన ఎవరి నమ్మకాలు వారికి ఉంటాయి. అలా వాటిని వెక్కిరించడం, విమర్శించడం సరికాదు. భారత్ ప్రస్తుతం రాకెట్ సైన్స్‌లో అగ్రరాజ్యం అమెరికాను కూడా దాటేశాం.. ఒక్కోసారి అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌కు వంటి అభివృద్ధి చెందాల శాటిలైట్స్‌ను నింగిలోకి పంపుతున్నాం. కానీ, మన సైంటిస్టులు రాకెట్ నింగిలోకి వెళ్లే సమయంలో ముందుగా పూజ చేసి కొబ్బరికాయ కొడుతారని మీకు తెలుసా..! సైన్స్ రియాలిటీ అయినా.. సైన్స్ ఇవ్వలేని ధైర్యాన్ని నమ్మకం ఇస్తుందని భారతీయులు బలంగా నమ్ముతారు.

అయితే, హిందూ సంప్రదాయంలో ఏ శుభకార్యం తలపెట్టినా పూజారులు, పండితులు నారికేళం(టెంకాయ, కొబ్బరికాయ) కొట్టి గానీ ప్రారంభించరు.అయితే, ఒక్కోసారి టెంకాయ కుళ్లిపోయింది వస్తుంటుంది. అలాంటి టైంలో ఏమైనా చెడు జరుగుతుందో ఏమో అని చాలా మంది అనుమాన పడుతుంటారు. నిజానికి టెంకాయ కుళ్లితే.. మంచికా లేక చెడుకా.. ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. పూజ చేస్తున్న టైంలో కొట్టిన కొబ్బరికాయ కుళ్ళితే దోషమేమి కాదట.. మనకు ముందే తెలిసి చేయడం లేదు కదా..! కనుక ఆలయాల్లో కొట్టిన టెంకాయ కుళ్లితే వెంటనే దానిని నీళ్ళతో కడిగి మళ్ళీ మంత్రోచ్చారణ చేసి స్వామివారిని అలంకరిస్తారట.. అందులో దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కానీ.. కొట్టిన మనిషిది కాదని చెబుతున్నారు.
ఇకపోతే ఇంట్లో పూజ చేస్తున్న క్రమంలో కుళ్ళిన కొబ్బరికాయ వస్తే కాళ్లు, చేతులు, మొహం కడుక్కుని పూజా మందిరాన్ని శుభ్రం చేసి పూజ ఆరంభిస్తే చాలట..ఇక వాహన పూజ టైంలో కూడా కుళ్లిన కొబ్బరి వస్తే భయపడాల్సిన పనిలేదట.. దాని దిష్టి అంతా పోయిందనుకోవాలని చెబుతున్నారు. లేదా మళ్లీ కొత్త కొబ్బరికాయ కొడితే చాలంట..
Read Also : Control Blood Sugar : మీకు షుగర్ ఉందా.. ఆ సమయంలో వీటి జోలికి అసలే వెళ్లొద్దు..!