Betel Leaf Remedies : మీ ఇంట్లో ఆర్థిక సమస్యలా? అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? ఎలాంటి కష్టమైనా? మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నా వెంటనే పోవాలంటే అద్భుతమైన రెమిడీ ఒకటి ఉంది. ఈ రెమిడీని భక్తిశ్రద్ధలతో చేశారంటే చాలు.. కొద్దిరోజుల్లోనే మంచి మార్పులను చూస్తారు. మీ కష్టాలన్నీ పోయి అన్ని సంతోషాలే మీ ఇంట్లో విరజిల్లుతాయి. మీరు చేయాల్సిందిల్లా.. తమలపాకుతో ఇంటి ముందు తోరణం కట్టుకోవడమే.. అదేలా చేయాలో ఇప్పుడు చూద్దాం..
తమలపాకు చెట్టు ఇంట్లో ఉందా? అయితే, ఇలా తమలపాకుతో ఆంజనేయ స్వామికి ప్రత్యేకంగా ఆకు పూజ చేస్తూ ఉండండి. తమలపాకు చెట్టు ఇంట్లో ఉండడం వల్ల అనేక సిరిసంపదలు కలుగుతాయి. పూర్వరోజుల్లో అమృతం కోసం దానవులు, దేవతలు క్షీరసాగర మదనం చేసినప్పుడు లక్ష్మి దేవితోపాటు తమలపాకులు కూడా పుట్టాయని పురాణాల్లో చెబుతారు. తమలపాకు చెట్టు ఎవరింట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో శనీశ్వరుడికి తావు ఉండదు. గ్రహ దోషాలు, శత్రుపీడలు ఉండనే ఉండవు. ఆర్థిక సమస్యలు, భూత, పిశాచ సమస్యలు పోవాలంటే… రోజు ఒక తమలపాకు తీసుకొని శ్రీరామ అని సింధూరంతో రాసి హనుమంతుని దగ్గర పెట్టి పూజ చేసుకోవాలి. ఆ తర్వాత ఆకుని తినవచ్చు లేదా పారే నీటిలో వేయాలి. ఇలా చేస్తే.. ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని అంటారు. తమలపాకు ఇంట్లో తూర్పు ఈశాన్యం లేదా ఉత్తర తూర్పు ఈశాన్యంలో పెంచుకోవడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.
తమలపాకు చెట్టు.. ఇంట్లో ఉండడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. తమలపాకు రెమిడీని చేయడానికి మంచిరోజుగా అమావాస్య శ్రేష్టమైనది. ఆరోజునే ఈ రెమిడీని మొదలు పెట్టుకోవచ్చు లేదా మీకు వీలు కుదిరినప్పుడు ఏ రోజైనా సరే.. మీరు తమలపాకులు సేకరించాలి. 10 లేదా 11, 15, 18, 21, 28 ఇలా తమలపాకులను తీసుకోవాలి. వాటిని కడగవద్దు. తడి క్లాత్‌తో శుభ్రంగా తుడుచుకోవాలి. ఇప్పుడు తమలపాకు కాడ చివర్ల ముందు వెనక గంధం కుంకుమతో అలంకరించుకోవాలి.
ఉదయాన్నే మీ కులదైవానికి.. తెలియని వారు అయితే.. తమ ఇష్టదైవానికి పాదాల దగ్గర పెట్టి మీ మనసులో ఉన్న కోరికను మీ తీరని కష్టం చెప్పుకుని పూజ చేసుకోవాలి. మళ్లీ, సాయంత్రం 6 గంటలు కూడా పూజ చేసుకోవాలి. తెల్లటి దారానికి పసుపు రాసి పూజ చేసిన తమలపాకులు తీసి దారంతో ముళ్ళు వేసుకోవాలి. తొడిమె విరగకుండా నెమ్మదిగా తోరణం తయారు చేసుకోవాలి. ఆ తమలపాకు తోరణాన్ని ప్రధాన ద్వారానికి తోరణంలా కట్టాకోవాలి. తమలపాకు ఎండిపోయేదాకా ఉంచాలి. మూడు రోజులకు ఒకసారి మార్చుకోవాలి. 11, 28 సార్లు ఈ రెమిడిని మరలా చేస్తుండాలి.
ఎండిన తోరణానికి ఉన్న ఆకులు ఎవరి తొక్కని ప్లేసులో చెట్టు మొదల్లో వేసుకోవాలి. తోరణం దారాన్ని భాగాలుగా చేసి ఆడవాళ్లు ఎడమ చేతికి, మగవాళ్ళు అయితే కుడి చేతికి తోరణంలా కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంత పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయంటే మాటల్లో చెప్పలేం.. కరుడుగట్టిన వారికైనా అంతా మంచిగా మారుస్తుంది. నెగిటివ్ ఎనర్జీ వంటి ఎలాంటి దుష్ట శక్తులు ఉన్నా మన ఇంట్లో నుంచి బయటికి పంపిస్తుంది. అంత శక్తి ఈ తమలపాకు తోరణానికి ఉంది. మీ సంకల్పం దృఢంగా ఉండాలి. మీ కోరిక కూడా బలంగా ఉండాలి. ఈ రెమిడీ చేసిన వారికి మంచి ఫలితాలు పొందవచ్చు.. అలాగే ప్రతిరోజు సాయంత్రం ధూపం వేసుకోవడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పోతుంది.
Read Also : Tamalapaku : ‘ధనలక్ష్మీ’ కరుణించడం లేదా..? తమలపాకుతో ఈ పరిహారం చేయండి.. ఇక మీ ఇంట్లో డబ్బే డబ్బు!