Homemade ayurvedic drink : ఇటీవల కాలంలో చాలా మందికి గ్యాస్ సమస్యలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని పరిష్కరించుకునేందుగాను ఇంగ్లిష్ మందులను ఉపయోగిస్తున్నారు. కాగా, వాటి వలన సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి ఇబ్బందులు పడుతున్నారు. అలా కాకుండా సహజ సిద్ధంగా ఎంతటి తీవ్రమైన గ్యాస్ సమస్యలనైనా ఆయుర్వేద మూలికలతో నయం చేసుకోవచ్చు. ఈ మూలికలను వాడటం ద్వారా అజీర్తి సమస్యలు కూడా పరిష్కారమవుతాయి.
ఇకపోతే ఈ అజీర్తి సమస్యలు సాధారణంగా సరైన డైట్ పాటించకపోవడం వల్లే ఏర్పడుతాయని పెద్దలు చెప్తున్నారు. అది నిజం కూడా. సరైన ఫుడ్ తీసుకోకపోవడమో లేదా అతిగా ఫుడ్ తీసుకోవడం వల్లనో అజీర్తి గ్యాస్ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ తీసుకోవడం వలన ఈ అజీర్తి సమస్యలు ఇంకా ఎక్కువగా వస్తుంటాయి. గ్యాస్ ను పెంచే ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే చాలా మంచిది.. అలాంటి ఫుడ్ తినకుండా ఉండేందుకు ప్రయత్నించాలి.
ఈ సంగతులు పక్కనబెడితే.. విపరీతమైన అజీర్తి సమస్యలున్న వాళ్లు ఈ మూలికలు తీసుకుంటే వెంటనే వారి సమస్యలు పరిష్కారమవుతాయి.గడ్డి చామంతి.. గ్యాస్ సమస్యను పరిష్కరించే మూలికగా పని చేస్తుంది. వీటి పూలతో తయారు చేసిన చాయ్ తీసుకున్నట్లయితే గ్యాస్ నుంచి విముక్తి లభిస్తుంది. అలా ప్రతీ రోజు రెండు కప్పుల గడ్డి చామంతి చాయ్‌ను తీసుకుంటే కనుక చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.
రెండు కోత్తి మీర ఆకుల రసం తీసుకున్నాకూడా గ్యాస్ సమస్య నయమవుతుంది. కోతిమీర ఆకులను ప్రతీ రోజు మార్నింగ్, ఈవినింగ్ టైమ్స్‌లో ఓ చెంచడు మోతాదులో తీసుకన్నట్లయితే ఉపయోగాలుంటాయి. ఈ కోతి మీర ఆకుల రసం తీసుకోవడం వలన జీర్ణాశయ గోడలు స్ట్రాంగ్ అవుతాయి. ఫలితంగా గ్యాస్ సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరమైపోతాయి. ఇకపోతే పరగడుపున చెంచడు తులసి ఆకుల రసం తీసుకున్నా కూడా చాలా చక్కటి ఉపయోగాలుంటాయి.
జీర్ణ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. చెంచడు జీలకర్రను తీసుకుని నీటిలో మరిగించి డికాషన్ లా చేసుకుని తాగినా చక్కటి ప్రయోజనాలుంటాయి. పూదీనా లీవ్స్ రసం కూడా ప్రతీ రోజు మార్నింగ్, ఈవినింగ్ తీసుకుంటే కనుక చాల చక్కటి ఉపయోగాలుంటాయి. పూదీనా చట్నీ తీసుకన్నా చక్కటి ప్రయోజనాలుంటాయి. గ్యాస్ సమస్యలన్నీ కూడా పరిష్కారమైపోతాయి.
Read Also : Psyllium Husk Benefits : ఈ మొక్కను తింటే అనారోగ్య సమస్యలు దూరం.. బీపీ, షుగర్‌కు బెస్డ్ మెడిసిన్..