Alekhya Reddy : నందమూరి తారకరత్న మరణించి దాదాపు 2 నెలలు గడుస్తుంది. ఇంకా ఆ కుటుంబ సభ్యులు ఆ బాధ నుండి తేరుకోలేదు. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి వాళ్ల పిల్లలు ఆయన లేని లోటును మరిచిపోలేకపోతున్నారు. అలేఖ్య రెడ్డి తన భర్తతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ ఉంటారు.. అవి కాస్త వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఈ మధ్యకాలంలో సినీ వర్గాలలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది తారకరత్న చివరి కోరిక తీర్చడానికి అలేఖ్య సిద్ధమవుతున్నారట.. అలేఖ్య వచ్చే ఎన్నికలలో టీడిపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారట.
2024లో ఎన్నికల్లో గుడివాడ నుంచి అలేఖ్య రెడ్డి పోటీ చేయనున్నారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ఎంతో ఇబ్బందిగా మారిన కొడాలి నానికి చెక్ పెట్టడానికి చాలా ఏళ్ల నుంచి టీడీపీ ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.. తారకరత్న తన మరణానికి ముందు గుడివాడ నుంచి కొడాలి నానిపై పోటీ చేయాలని భావించారంట. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారంట. పోటీకి అంతా క్లియర్ అనుకున్న సమయంలో తారకరత్న గుండెపోటుకు గురై మరణించారు.
ఇప్పుడు తన భర్త ఆఖరి కోరిక తీర్చడానికి అలేఖ్య ఆ స్థానాన్ని నుండి పోటీ చేయాలని భావిస్తున్నారట. అయితే, ఆ స్థానం నుంచి పోటీ చేయించడానికి చంద్రబాబు నుంచి ఎలాంటి అనుమతి రాలేదంట. ఒకవేళ చంద్రబాబు నుంచి అనుమతి వస్తే అలేఖ్య పోటీకి దిగుతారని సమాచారం. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని గతంలో టీడీపీ నుంచి పోటీ చేశారు. 2004లో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012 సంవత్సరం టీడీపీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

ఆ తర్వాత నుంచి గుడివాడలో వైసీపీ కాంగ్రెస్ గెలుస్తునే ఉంది. కొడాలి నాని అప్పటినుంచి చంద్రబాబు, నారా లోకేష్ పై టీడీపీ నేతలపై కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. వచ్చే ఎన్నికలలో గుడివాడలో టీడీపీ గెలవాలని లక్ష్యం పెట్టుకుంది. కొడాలి నానికి గట్టి పోటీనిచ్చే బలమైన అభ్యర్థిని టీడీపీ తరపున రంగంలోకి దించాలనే టీడీపీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి గుడివాడ టీడీపీ ఇంఛార్జీగా రావి వెంకటేశ్వరరావు కొనసాగుతున్నారు. వెనిగళ్ల రాము లేదంటే.. తారకరత్న భార్య అలేఖ్య రెడ్డికి టీడీపీ టికెట్టు ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నారని పార్టీ వర్గాల సమాచారం.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నందమూరి తారకరత్న భార్య అలేఖ్యా రెడ్డిని టీడీపీ తరపున బరిలోకి దింపి కొడాలి నానికి చెక్ పెట్టాలని టీడీపీ భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. రాబోయే ఎన్నికలలో గుడివాడలో పోటీ రసవత్తరంగా మారనున్నట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.