store fresh vegetables : చాలా మంది కూరగాయలను నిల్వ ఉంచుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతుంటారు. మరి కొందరు ఎప్పటికప్పుడే అవసరాన్ని బట్టి కొనుగోలు చేస్తారు. కూరగాయలు దొరకని సందర్భాల్లో ఒకే సారి ఎక్కువ మోతాదులో తీసుకొస్తాం. ఇలాంటి టైంలో కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచుకోవాలని అనుకుంటాం. ఈ ట్రిక్స్ పాటిస్తే కూరగాయలను ఫ్రెష్‌గా ఉంచుకోవచ్చు. ఈ ట్రిక్స్‌ను ఫాలో అయితే సుమారు ఆరు నెలలు కంటే ఎక్కువ రోజులు వాటిని నిల్వ ఉంచుకోవచ్చు.

ముందుగా తీసుకొచ్చని కూరగాయలను కడిగేసి బట్టతో తుడవాలి. క్యారేట్లను నిల్వ ఉంచాలి అనుకుంటే వాటికున్న తొక్కలు తీసి క్యూబ్స్‌గా ముక్కలు చేసుకోవాలి. బీన్స్‌ను సైతం అలాగే ముక్కలుగా కట్ చేసుకుని సైడుకు ఉంచాలి. ఒక పెద్ద గిన్నెలో సగం కంటే ఎక్కువగా నీటిని తీసుకోవాలి. కట్ చేసిన కూరగాయల ముక్కలను అందులో వేయాలి. అందులో సుమారుగా 1 నుంచి 2 చెంచాల ఉప్పు వేసి బాగా మిక్స్ చేయాలి. ముందు ఆ గిన్నెను ఎకువ మంటపై పెట్టంది. తర్వాత మీడియానికి తీసుకొచ్చి.. ఆ తర్వాత మంటను చిన్నగా ఉంచాలి.
క్యారెట్స్ ఉడికిన అనంతరం మంటను ఆర్పేసి ఆ నీటిని పక్కకు తీసెయ్యాలి. , బీన్స్, బఠానీలకు సైతం ఇదే ప్రాసెస్.. ఇక ఉడికిన వాటిని మరో గిన్నెలోకి తీసుకుని అందులో కొద్దిగా వాటర్ పోశాక వాటిలో ఐసు పీసులు వేయాలి. సుమారు 10 నిమిషాల పాటు అందులోనే ఉంచాలి. ఇప్పుడు కూరగాయలను తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక టవల్‌పై ఆ కూరగాయల ముక్కులను వేసి పదిహేను నిమిషాలు గాలికి బాగా ఆరనివ్వాలి. ఇలా కూరగాయలన్నింటిని మీరు ఇలా చేసుకోవచ్చు. అవి ఆరిపోయాక.. ఒక జిప్ ఉన్న బ్యాగును తీసుకుని అందుల గాలి ఉండకుండా చూసుకోవాలి. కూరగాయల ముక్కలను అందులో వేసి ప్యాక్ చేయాలి. తర్వాత వాటిని ఫ్రిజ్‌లో పెట్టండి. ఇట్లా చేయడంతో ఇవి 6 నెలల వరకు నిల్వ ఉంటాయి.
Read Also : Food At Wrong Time : ఆహారం తినేటప్పుడు మీరు చేస్తున్న తప్పులివే!