Spring Onions : ఉల్లిపాయను కొన్ని వేళ ఏళ్ల నుంచి భారతీయులు వంటకాల్లో ఉపయోగిస్తున్నారు. ఉల్లిపాయతో చేస్తే వంటకాలు మంచి టేస్ట్ తో ఘుమఘుమలాడుతాయి. ఈ ఉల్లిపాయల మొలకలనే ఉల్లికాడలు అని అంటారు. వీటిని ఇంగ్లిష్ లో స్ర్పింగ్ ఆనియన్స్ అని వ్యవహరిస్తారు. ఈ ఉల్లికాడల ప్రయోజనాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇవి మన శరీరానికి ఏ విధమైన మేలు చేస్తాయో ఒక్కసారి గమనిస్తే..
ఎవరైతే ఉల్లిపాయల్ని డైరెక్టుగా వాడలేరో వారి కోసం ఉల్లి కాడలు మంచి ప్రత్యామ్నాయం. ఇవి తక్కువ ఘాటును కలిగి ఉంటాయి. ఈ స్ప్రింగ్ ఆనియన్స్ ను అనేక రకాల కూరల్లో సలాడ్స్ లో వేస్తారు. అంతే కాకుండా కొత్తి మీర, కరివేపాకు వాడే విధంగా వీటిని కూరల్లో కూడా వాడతారు. స్త్రీలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలల్లో తరచుగా ఉల్లి కాడల్ని తింటే కడుపులో ఉన్న బిడ్డకు అధిక ఫోలిక్ యాసిడ్ అందుతుంది. గర్భస్త శిశువుకు ఎటువంటి వెన్నముక సమస్యలు రాకుండా ఇది నివారిస్తుంది.
ఇది తరుచూ తినే వారిలో కొలెస్టాగరల్ హైబీపీని కంట్రోల్ లో ఉంటాయి. ఎవరైనా జలుబు, దగ్గుతో బాధపడితే వారికి ఉల్లికాడల సూప్ మాంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. దీనిలో ఉండే పేక్టిన్ అనే పదార్థం వలన పెద్దపేగు దెబ్బ తినకుండా ఉంటుంది. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన ధరి చేరవు. ఉల్లి కాడలు తిన్న వారిలో అధిక బరువు సమస్య తలెత్తదు. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ అనేది మన ఆకలిని కంట్రోల్ లో ఉంచుతుంది. పైల్స్ సమస్యతో బాధపడే వారు ఉల్లికాడ ముక్కలను పెరుగుతో కలుపుకుని తింటే త్వరగా ఉపశమనం పొందుతారు.
Read Also : Ayurveda Diet Tips : అధిక బరువు తగ్గేందుకు ఆయుర్వేద చిట్కాలు..!