Hing Water : చాలా మంది ఇటీవల కాలంలో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రధానం వెయిట్ పెరిగిపోవడం, ఫలితంగా ఇతర అనారోగ్య సమస్యలు వారిని అటాక్ చేస్తున్నాయి. దాంతో వారు ఇక ఆరోగ్యవంతులు కావడానికి చాలా డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. కాగా, ఈ చిట్కాతో మనిషికి బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
ఇంగువ పొడి కలిపిన నీటిని ప్రతీ రోజు తీసుకున్నట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయట. ప్రతీ రోజు నిద్రించే ముందర ఇంగువ పొడి కలిపిన వాటర్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. అయితే, ఇంగువ పౌడర్ ఎక్కువ వేసుకోవద్దు. అర గ్లాసు గోరువెచ్చని నీళ్లలో రెండు చిటికెల ఇంగువ పౌడర్ చాలు..

యాంటీ వైరల్ ప్లస్ యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన ఇంగువ పొడి దగ్గు, ఆస్తమాతో పాటు శ్వాస కోశ సంబంధిత సమస్యలను పరిష్కరిస్తుంది. బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడంలో ఇంగువ పొడి కీ రోల్ ప్లే చేస్తుంది. రక్తం గడ్డం కట్టకుండా ఉండటానికి ఇంగువ పొడిలోని పోషకాలు దోహదం చేస్తాయి.
శరీరంలోని రక్తం గడ్డలను పలుచగా చేయడంలో ఇంగువ పొడి సాయపడుతుంది. చాలా మంది ఇంగువ పొడి అనగానే అది చెట్లకు మాత్రమే ఉపయోగపడుతుంది అనుకుంటారు. కానీ, దీని వల్ల మనుషులకు కూడా చాలా ప్రయోజనాలున్నాయి. బ్లడ్‌ను శుద్ధి చేయడంలో ఇంగువ పొడి కీలక పాత్ర పోషిస్తుంది. రక్తాన్ని పలుచగా చేయడంతో పాటు ప్రసరణను మెరుగు పరచే చక్కటి గుణం ఇంగువ పొడికి ఉంది.
ఇలా బ్లడ్‌ను క్లీన్ అండ్ క్యూర్ చేయడం వల్ల హార్ట్ అటాక్ చాన్సెస్ కూడా తగ్గుతాయి. చెంచడు ఇంగువ పొడిని కొద్ది పాటి నీళ్లలో కలిపి పొట్టు చుట్టూత రుద్దుకుంటే పొట్ట నొప్పి నుంచి తక్షణమే ఉపశమనం లభిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.
Read Also : Coriander Kashayam : ధనియాల కషాయంతో థైరాయిడ్ సమస్యలకు ఇలా చెక్ పెట్టొచ్చు!