Coriander Kashayam : ఇటీవల కాలంలో చాలా మంది చిన్న వయసులోనే ఊబకాయలు అవుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం మారుతున్న జీవన శైలి. ఒకప్పటితో పోలిస్తే ప్రజెంట్ ఫుడ్ హ్యాబిట్స్‌తో పాటు వర్కింగ్ స్టైల్ కూడా చాలా చేంజ్ అయింది. ఈ క్రమంలోనే రకరకాల వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే చాలా మంది థైరాయిడ్ సమస్యలతో సతమతమవుతున్నారు.
థైరాయిడ్ సమస్య రావడానికి అధిక బరువు కూడా కారణమవుతున్నదని తెలుస్తోంది. ఇకపోతే థైరాయిడ్ వలన శరీరంలోని పలు ప్రదేశాల్లో బాగా వాపు వస్తుంటుంది. దాంతో పనులు చేయలేకపోయే పరిస్థితులు ఏర్పడుతాయి. కాగా ఈ వ్యాధి నుంచి విముక్తి పొందాలంటే ఈ చిట్కాను ఫాలో కావాలి.
ఆయర్వేదం ప్రకారం ధనియాల కషాయం తీసుకుంటే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కషాయం ఎలా తయారుచేయాలంటే.. చెంచడు ధనియాలను అర చెంచడు త్రికటు చూర్ణంతో కలపాలి. అందులో ఒక గ్లాసెడు వాటర్ మిక్స్ చేయాలి. ఇందుకుగాను ధనియాలను ముందురోజు రాత్రి బాగా దంచాలి. ఆ తర్వాత చల్లటి నీటిలో వేసి ఉదయాన్నే వడబోయాలి.
అలా చేసిన తర్వాత వాటిని తాగాలి. ఇలా ప్రతీ రోజు చేస్తే కనుక చక్కటి ప్రయోజనాలుంటాయి. అయితే, కొద్ది రోజులు తాగితే ప్రయోజనం ఉండబోదు. క్రమం తప్పకుండా ప్రతీ రోజు ధనియాల కషయాన్ని సేవిస్తూ ఉండాలి. అలా చేస్తేనే మీ ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలుంటాయి.
ఒకవేళ వాటర్‌లో కలుపుకుని తాగలేనట్లయితే కూల్ డ్రింక్స్‌లో కలుపుకుని అయినా తాగొచ్చు. అలా చేసినా మీకు చక్కటి ప్రయోజనాలుంటాయి. థైరాయిడ్ సమస్యను ప్రభావితం చేయగల గ్రంథుల పనితీరును కంట్రోల్ చేయడంలో ధనియాల కషాయం కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ప్రతీ రోజు క్రమం తప్పకుండా ధనియాల కషాయం తీసుకోవాలి.
Read Also : Coriander Seeds Benefits : ధనియాల్లో ఎన్నో ఔషధ గుణాలు.. ఆరోగ్యం మీ చేతుల్లోనే..? ఉపయోగాలు తెలుసుకోండిలా..!