Mutton Head Fry : ఆదివారం వచ్చిందంటే చాలు.. నాన్‌వెజ్ ప్రియులు మటన్ షాపుల ముందు క్యూ కట్టేస్తుంటారు. మటన్ షాపుల దగ్గర నుంచి మటన్ తలకాయ తెచ్చుకుని వండేస్తుంటారు. అయితే.. చాలామందికి మటన్ తలకాయ కూర చాలా రుచిగా ఉంటుందని తెలుసు.. కొంతమందికి మటన్ తలకాయ కూరను ఎలా టేస్టీగా తయారుచేసుకోవాలో తెలియకపోవచ్చు. మటన్ తలకాయ ప్రై చేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. కొంచెం కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు. మటన్ తలకాయ ఆరోగ్యానికి కూడా చాలామంచిది అంటారు. నొప్పుల సమస్యలతో బాధపడేవాళ్లు మటన్ తలకాయను ఎక్కువగా తీసుకుంటే తొందరగా ఉపశమనం పొందుతారట.. ఇంతకీ మటన్ తలకాయ ప్రై ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..
మటన్ తలకాయ ఫ్రై కూర కావలసిన పదార్థాలు :
మటన్ తలకాయ ముక్కలు ఒక కేజీ తీసుకొని వాటిని శుభ్రంగా కడుక్కోవాలి.. తలకాయ ముక్కలు, మూడు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక స్పూన్ ధనియాల పొడి, నాలుగు స్పూన్ల కారం, ఉప్పు రుచికి సరిపడంత, ఒక టేబుల్ స్పూన్, 8 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకోవాలి, రెండు ఉల్లిపాయలు కట్ చేసుకోవాలి చేసుకోవాలి, నూనె 150 గ్రామ్, ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా, లవంగాలు మూడు, దాల్చిన చెక్క ఒక ఇంచు, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి..

మటన్ తలకాయ ఫ్రై తయారీ విధానం..
ఒక బౌల్లో తీసుకొని తలకాయ ముక్కల్లో వేసి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకోవాలి నూనె వెయ్యాలి నూనె వేడి అయిన తర్వాత లవంగాలు, దాల్చిన చెక్క వేయాలి. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించాలి. కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు ఉంచాలి. కొత్తిమీర పుదీనా వేయాలి. కలిపి పెట్టుకున్న ఇప్పుడు తలకాయ కూరను గిన్నెలో వేసి బాగా కలపాలి.
ఒక పది నిమిషాల తర్వాత ఉప్పు వేసి బాగా కలపాలి. తలకాయ కూర మగ్గడానికి చాలా సేపు పడుతుంది కాబట్టి తలకాయ ముక్కలు ఉడికినంతవరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. కారం, రుచికి సరిపడేంత ఉప్పు వేసుకొని బాగా కలపాలి. కూర అడుగంటకుండా కలుపుతూ ఉండాలి గరం మసాలా పొడి వేసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచాలి. మరి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. మేక తలకాయ కూర రెడీ.. ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.