Ants in House : ఇంట్లో చీమలు ఉన్నాయంటే చాలు.. చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. ఆ చీమలను ఎలాగైనా ఇంట్లో నుంచి బయటకు పంపేయాలని అనుకుంటారు. ఎందుకంటే ఇంట్లో ఏదేని తినే వస్తువు స్వీట్ కాని ఇతర ఆహార పదార్థాలు కాని పెట్టినపుడు వాటిపైకి చీమలు వస్తాయని..ఈ నేపథ్యంలోనే మార్కెట్‌లో దొరికే మందులు వాడుతుంటారు. అయితే, వాటి వలన ప్రయోజన ముంటుంది. కానీ, వాటి వాసన చీమలతో పాటు మనుషులకూ పడదు. దాంతో మరిన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఈ సింపుల్ చిట్కా ఫాలో అయితే మీ ఇంట్లో ఇక అసలు చీమలు ఉండవు.
ఇంట్లో నుంచి చీమలను బయటకు పంపేయాలంటే ఈ రెమిడి తయారు చేసుకోవాలి. ఇందుకుగాను నిమ్మకాయ తొక్క, సాల్ట్, లవంగాలు కావాలి. నిమ్మకాయ తొక్కను బాగా పిండి అందులో నుంచి వచ్చిన రసానికి రెండు చెంచల ఉప్పు యాడ్ చేసి, అందులో నాలుగు లేదా ఐదు లవంగాలు వేయాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని పొడిగా చేయాలి. ఇక తయారు అయిన ఈ మిశ్రమాన్ని మీరు రెండు రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. తడి గుడ్డతో ఈ పొడిని అద్దుకుని ఇల్లంతా తుడిచేసుకోవచ్చు. లేదా ఈ పొడిని స్ప్రే బాటిల్‌లో నింపుకుని ఇల్లంతా స్ప్రే చేయొచ్చు.
ఇలా చేస్తే మీ ఇంట్లో నుంచి చీమలన్నీ పారిపోతాయి. నిమ్మకాయల స్మెల్ సాధారణంగా మనుషులకు మాత్రమే ఇష్టముంటుంది. చీమలకు వీటి స్మెల్ అస్సలు నచ్చదు. ఈ నేపథ్యంలోనే నిమ్మకాయ, సాల్ట్, లవంగాలతో చేసిన ఈ రెమెడితో ఇంట్లో నుంచి చీమలను బయటకు వెళ్లగొట్టచ్చు. ఇక ఈ రెమెడి చేసుకోవడం కూడా చాలా సింపుల్.. ఇంట్లో ఉండే నిమ్మకాయ, ఉప్పు, లవంగాలతో ఎవరైనా అతి తక్కువ సమయంలోనే రెమెడి రెడీ చేసుకోవచ్చు.
Read Also : Ayurvedic Remedies : వాసనను కోల్పోయారా ? ఈ ఆయుర్వేద చిట్కాలను ఓసారి ట్రై చేసి చూడండి