Henna Powder For Hair : హెన్నా పౌడర్ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. సహజంగా బయట తీసుకునే ఎన్నో పౌడర్లు కెమికల్ కలుపుతారు కాబట్టి ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు.. హెన్నా పౌడర్ ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. ఈ పౌడర్ ని యూస్ చేయడం వల్ల తెల్ల జుట్టు ఉన్న వారిని నల్లగా మారుతుంది. వారానికి ఒకసారి హెన్నా పేస్ట్ జుట్టుకు రాసుకోవడం వల్ల జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇటువంటి కర్లీ హెయిర్ అయినా జుట్టు సిల్క్ గా మారుతుంది. జుట్టు ఆరోగ్యంగా దృఢంగా తయారవుతుంది.ఈ పౌడర్.
కావలసిన పదార్థాలు… గోరింటాకు, మందార పూలు, మందారం ఆకులు, వేప ఆకు, ఉసిరికాయ..ముదిరిన గోరింటాకులను తీసుకోవాలి. ఆఫ్ కేజీ గోరింటాకులను శుభ్రం చేసి కాటన్ క్లాత్ పై రెండు రోజులు నీడలో ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత ఒక గంట సేపు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎర్ర మందార పూలు20, కొన్ని ఉసిరికాయలు తీసుకొని ఆరబెట్టుకోవాలి, రెండు గుప్పెడు మందార ఆకులను , గుప్పెడు వేప ఆకులు శుభ్రంగా కడిగి రెండు నుంచి మూడు రోజులు ఆరబెట్టుకోవాలి.

వేపాకు వేయడం వల్ల చుండ్రు సమస్య, తలపై దురద సమస్య ఇట్లే అరికడుతుంది.. గోరింటాకులు, మందార ఆకులు, వేపాకులు, మందార పూలు, ఉసిరికాయలు అన్ని చేతితో నలిపితే పౌడర్ అయ్యేంతవరకు ఆరబెట్టుకోవాలి. వీటన్నిటిని కలిపి మిక్సీ జార్ లో వేసి మెత్తటి పౌడర్ తయారు చేసుకోవాలి.
పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పౌడర్ ని పిండి జల్లెడ జల్లించుకోవాలి.. హెన్న పౌడర్ ని గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. దీన్ని ఎలా యూస్ చేయాలో ఇప్పుడు చూద్దాం.. ఒక బౌల్లో హెన్నా పౌడర్ తీసుకొని.. పెరుగు లేదా నిమ్మరసం కలుపుకొని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి..
Read Also : Coconut Milk for Hair : డ్యాండ్రఫ్ తో చికాకు పడుతుంటే ఒకసారి ట్రై చేయండి.. వావ్ అనకుండా ఉండలేరు..