Shatavari Powder : మారుతున్న లైఫ్ స్టైల్, బిజీ లైఫ్ కారణంగా చాలా మంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. దీని వల్ల అనేక హెల్త్ ప్రాబ్లమ్స్ తలెత్తుతున్నాయి. వీటి నుంచి బయటపడేందుకు చాలా మంది అనేక ప్రయ్నతాలు చేస్తున్నారు. డాక్టర్లను సైతం సంప్రదిస్తున్నారు. ఇక ప్రస్తుత లైఫ్ స్టైల్‌కు అలవాటు పడిన వారిలో చాలా మంది సంతానలేమి సమస్యలో బాధపడుతున్నారు. ఇందుకోసం లక్షలు ఖర్చు పెడుతున్నారు. అయితే కొన్ని ఆయుర్వేద పద్దతులతో ఇలాంటి ప్రాబ్లమ్స్‌కు చెక్ పెట్టొచ్చు. దీని కోసం కొన్ని ఆయుర్వేద చిట్టాలు పాటిస్తే సరిపోతుంది.
అయితే సంతాన ఉత్పత్తిలో శతావరి కీలకపాత్ర పోషిస్తుంది. దీనిని క్వీన్ ఆఫ్ హెర్బ్స్ గా ఆయుర్వేదంలో పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల స్త్రీ, పురుషుల్లో సంతాన ఉత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. పురుషుల్లో వీర్యం సామర్థ్యం పెరగడానికి ఇది చాలా హెల్ప్ అవుతుంది. వీర్యం ఉత్పత్తి సైతం పెరుగుతుంది. దీని వల్ల హార్మోన్ ప్రాబ్లమ్స్ సైతం తగ్గుముఖం పడతాయి. ఒక గ్లాస్ పాలలో ఓ చెంచాడు శతావరి చూర్ణాన్ని కలిసి రాత్రి పడుకునే సమయంలో తీసుకోవాలి. దీని వల్ల శరీరానికి చల్లదనం లభిస్తుంది.

దీనితో పాటు పీరియడ్స్ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు తగ్గుతాయి. రక్త సరఫరా మెరుగవడంతో పాటుగా బాలింతల్లో పాల ఉత్పత్తి పెరుగుతుంది. చికాకు, పని ఒత్తడి వంటి సమస్యల నుంచి దీనిని వాడటం వల్ల రిలీఫ్ పొందొచ్చు. దీనిని తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం వంటి సమస్యలు తగ్గుతాయి. ప్రశంతమైన నిద్ర దరిచేరుతుంది. దీనితో పాటు ఆరోగ్య సమస్యలు సైతం దూరమవుతాయి. వ్యాయమం చేసే వారు దీనిని తీసుకుంటే అలసట దరిచేరదు. ఫలితంగా యాక్టివ్ గా ఉండొచ్చు. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇబ్బందులు తలెత్తినప్పుడు డాక్టర్లను సంప్రదించడం ఉత్తమం.
Read Also : Curry Leaves : కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న వారు ఇది తీసుకుంటే అద్భుతమైన ఫలితాలు .. ఎలా తీసుకోవాలంటే..?