Cashew Nuts Benefits : జీడిప‌ప్పుతో ఎన్నో లాభాలో.. ఇంతకీ, ఎవ‌రు తినొచ్చు, ఎవ‌రెవరూ తిన‌కూడ‌దో తెలుసా?

Cashew Nuts Benefits : జీడిపప్పు ఎవరెవరు తినకూడదో తెలుసా..? జీడిపప్పు తింటే కొవ్వు పెరిగిపోతుందని చాలామంది అపోహ ఉంది. అలాగే రోజు ఎన్ని జీడిపప్పులు (Cashew Nuts Benefits) తినవచ్చు అనే సందేహం చాలామందికి కలుగుతుంది. ఈ జీడిపప్పును బీపీ (Cashew benefits in telugu) ఉన్నవారు తినవచ్చా..? ఇది ఆరోగ్యానికి చేసే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.. జీడిపప్పులో సున్నా కొలెస్ట్రాల్ ఉంటుంది. కావున కొలెస్ట్రాల్ ఉండదు కనుక గుండెకు ఎలాంటి హాని చెయ్యదు.

మెగ్నీషియం నిలువలు అధికంగా ఉండడంతో ఎముకల పుష్టికి దోహదపడతాయి.. మన శరీరంలో సుమారు 300 నుంచి 750 మిల్లి గ్రాముల మెగ్నీషియం అవసరం, కనుక జీడిపప్పు తీసుకుంటే మేలు.. సోడియం శాతం తక్కువగా ఉంటుంది కనుక బిపి (BP) ఉన్నవారు కూడా జీడిపప్పును తినవచ్చు.. క్యాన్సర్ సమస్యను అడ్డుకునే యాంటీ ఆ క్సిడెంట్స్ జీడిపప్పులో కలిగి ఉంటుంది.. రోజుకు 5 నుంచి 10 వరకు మాత్రమే జీడిపప్పులను తినవచ్చు. జీడిపప్పును నేరుగా తినడం ద్వారా 596 క్యాల‌రీల వరకు శ‌క్తిని అందిస్తుంది.

10 Incredible Cashew Nut Benefits in Telugu
Cashew Nuts Benefits in telugu

Cashew Nuts Benefits : ఖాళీ కడుపుతో జీడిప‌ప్పు తింటే ఏమౌతుందంటే?

జీడిప‌ప్పు మితంగా ఉంటే ఎంత ఆరోగ్యమో అలాగే అతిగా తింటే కూడా అనేక సమస్యలు వస్తాయి. జీడిపప్పును ఖాళీ కడుపుతో తినడం వల్ల జీర్ణ సంబధిత సమస్యలు వస్తాయి. కొవ్వు ఎక్కువగా ఉండి అధిక బ‌రువు కలిగిన వాళ్లు జీడిప‌ప్పును అధికంగా తీసుకోరాదు. ఎందుకంటే.. ఇందులో క్యాల‌రీల శాతం ఎక్కువ‌గా ఉంటుంది. ఎక్కువ తీసుకుంటే కొవ్వు శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. షుగ‌ర్ (డయాబెటిస్) ఉన్న వాళ్లు జీడిపప్పును తినవచ్చు. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చాలామంది సన్నగా ఉంటారు.. చాలా నీరసంగా కనిపిస్తుంటారు.

వీరు మాత్రం జీడపప్పును అధికంగా తీసుకోవచ్చు. షుగ‌ర్ సమస్యతో బాధపడే లావుగా ఉన్నవారు మాత్రం జీడిపప్పును కొద్దిగా మాత్రమే తినాలి. గ‌ర్భిణీలు, బాలింత‌లు, శారీర‌క శ్ర‌మ చేసే వాళ్లు, పిల్లలు జీడిపప్పును అధికంగా తీసుకుంటుండాలి. జీడిప‌ప్పును ఇలా అసలు తిన‌కూడ‌దు. నెయ్యిలో వేయించుకుని జీడిపప్పులను తింటుంటారు.. అంతేకాదు.. కారం, ఉప్పు, మ‌సాలా కలిపి మరి తింటుంటారు. జీడిప‌ప్పును ఇలా తింటే అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. నీళ్లలో జీడిప‌ప్పును నాన‌బెట్టి తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిప‌ప్పులో పోష‌కాలు శరీరానికి అందుతాయి.

Read Also : Ashwagandha Health Benefits : అశ్వగంధతో ఆయుర్వేదంలో ఏయే జబ్బులను నయం చేయవచ్చో తెలుసా? కలియుగ సంజీవని..!

Leave a Comment