Calcium Deficiency : మానవ శరీరంలో ఎముకలే ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకోసం మనం తీసుకునే ఆహారంలో కాల్షియం మోతాదు సరిగా ఉండేలా చూసుకోవాలి. లేకపోతే ఎముకలు ధృడత్వం కోల్పోయి అనారోగ్యం బారిన పడుతుంటారు. కాల్షియం సరైన మోతాదులో శరీరానికి అందకపోతే చిన్న ఏజ్‌లోనే కీళ్ల నొప్పుల వంటి సమస్యలు వస్తుంటాయి. సాధారణంతా కొందరికి తీసుకునే ఆహారంలో శరీరానికి అవసరమైన మేర కాల్షియం దొరకదు.
దీంతో వారు వైద్యుల సూచన మేరకు కాల్షియం మాత్రలు వాడుతుంటారు. అయితే, కాల్షియం టాబ్లెట్లు అధికంగా వాడటం వలన శరీరంలో దాని మోతాదు ఎక్కువై హాని చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎప్పుడైనా మనిషి శరీరంలో కాల్షియం తక్కువైనా, ఎక్కువైనా చాలా ప్రమాదకరమరని, అందుకే వైద్యుల సూచన మేరకే ఎంత మేర కాల్షియం అవసరం ఉంటుందో అంతే మెయింటెన్ చేయాలంటున్నారు.
వైద్యులు ఏం చెబుతున్నారంటే.. పురుషులకు ప్రతీరోజు 1000 నుంచి 1200 మిల్లీగ్రాముల మోతాదులో కాల్షియం అవసరం ఉంటుందని.. స్త్రీలకు మాత్రం 1200 నుంచి 1500 మి.గ్రా. కాల్షియం తీసుకోవాలన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే 1300 నుంచి 2500 మి.గ్రా. కాల్షియం అవసరం ఏర్పడుతుందన్నారు. పైన చెప్పిన మోతాదులోనే కాల్షియం మనం తీసుకునే ఆహారంలో ఉండేలా చూసుకుంటే ఎటువంటి ఆరోగ్య సమస్యలు రావని నిపుణులు చెబుతున్నారు.
శరీరంలో కాల్షియం ఎక్కువైతే కిడ్నీలు వాటిని ఫిల్టర్ చేయలేవట.. దీంతో కిడ్నీల్లో రాళ్లు తయారయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళే కాల్షియం మోతాదు కంటే ఎక్కువ పెరిగితే బీపీ కూడా ఎక్కువ అవుతుందట.. కాల్షియం ఓవర్ అయితే ఎముకలు బలంగా మారకపోగా పెళుసుగా తయారవుతాయి. దీని మూలాన ఏ చిన్న ప్రమాదం జరిగిన ఎముకలు విరిగిపోయే అవకాశం ఉంది. కావున, కాల్షియం మాత్రలు వాడే వారు ఎప్పటికప్పుడు కాల్షియం చెక్ చేసుకోవాలి. లేకపోతే కాల్షియం ఫుడ్ తీసుకోవాలి. ఆకు కూరలు, కోడిగుడ్లు, పాలు, పెరుగు పదార్థాలు తరచూ తీసుకుంటే కాల్షియం సమస్యను నివారించవచ్చు.
Read Also : Knee Pains Tips : 7 రోజులు ఇలా చేస్తే చాలు.. కీళ్ల నొప్పులు, బాడీ పెయిన్స్, కాల్షియం లోపానికి చెక్..