Benefits of Sitting : సాంకేతికత పెరుగుతున్న మానవుడి జీవనశైలిలో పెనుమార్పులు సంభవించాయి. ఒకప్పుడు మానవులు శారీరక శ్రమను ఎక్కువగా నమ్ముకునేవారు. ప్రస్తుతం మిషిన్లపై ఆధారపడుతున్నారు. దీంతో అధిక శ్రమ, సమయం కూడా మిగులుతోంది. దీనికి తోడు మనిషి తన ఆహార అలవాట్లను కూడా మార్చుకున్నాడు. ఒకప్పుడు నేలపై కూర్చుని తినడానికి బదులు ప్రస్తుతం డైనింగ్ టేబుల్, సోఫా సెట్లు, కుర్చీలపై కూర్చుని తిండున్నాడు. ఇలా చేయడం వలన పలు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడైనా ఆహారం పైన కూర్చుని కంటే కింద కూర్చుని చేయడం వలన శరీరానికి చాలా మేలు జరుగుతుందని వైద్యులు స్పష్టంచేస్తున్నారు.

నేలపై కూర్చుని తింటే ఎన్ని ప్రయోజనాలున్నాయంటే..
నేలపై కూర్చుని తినే సమయంలో ప్రతీసారి ముందుకు, వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేస్తూ ఆహారం తీసుకోవడం వలన పొట్టలోని కండరాలు యాక్టివ్ గా మారుతాయి. త్వరగా జీర్ణం అవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. అలాగే కింద కూర్చుని తినడం వలన బ్యాక్ బోన్ నిటారుగా ఉండి.. మెదడుకు సులువుగా సమాచారం ఇస్తుంది. ఆహారం సరిపోయిందని, ఇక తీసుకోవద్దని మెదడుకు సంకేతాలు వెళతాయి. ఇది బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
ఇటీవల కాలంలో పద్మాసనంలో నేలపై కూర్చోవడం ఎక్కడా కనిపించడం లేదు. పైన కూర్చుని తినడం కంటే నేలపై కూర్చుంటే కండరాలు, కీళ్లపై ఒత్తిడి తగ్గుముఖం పడుతుంది. నడుము నొప్పి, బాడీ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. యోగాలో పద్మాసనానికి మంచి ఉపయోగం ఉంటుంది. దీనివలన శరీరానికి రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. గుండె పనితీరులో మంచి పాత్రను పోషిస్తుంది. ఇకపై మీరు కూడా పైన కూర్చుని తినడం బదులు కింద కూర్చుని తినడం అలవాటు చేసుకోండి..అలా చేస్తే మంచి ఆరోగ్యం మీ సొంతం అవుతుంది.
Read Also : Water Drinking Habit : నీరు అతిగా తాగితే ఇన్ని సమస్యలా? ఏయే సమయాల్లో నీటిని తాగితే మంచిది..