Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. స్పైసిగా ఇష్టపడే వారి కోసం ఈ చికెన్ ఫ్రై ఎంతో టేస్టీగా ఉంటుంది. స్పెషల్ గార్లిక్ చికెన్ ఫ్రై వేడివేడి అన్నంలో, జొన్న రొట్టెలో చపాతి పరోట రాగిసంకటి చిరుధాన్యాల రైస్ తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.
కావలసిన పదార్థాలు… చికెన్-750 గ్రామ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్-1 టేబుల్ స్పూన్, కారం ఉప్పు( రుచికి తగినంత) నూనె, నిమ్మకాయ, కొత్తిమీర, కరివేపాకు-2 రెమ్మలు, వెల్లుల్లి రెబ్బలు-20, ధనియాలు-1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి-7, దాల్చిన చెక్క-2 ఇంచులు, మిరియాలు-1 టేబుల్ స్పూన్, పసుపు-1/2 టీ స్పూన్, యాలకులు-3, లవంగాలు-3, ఉల్లిపాయ-1( పెద్దది),….
తయారీ విధానం… చికెన్ ముక్కలను శుభ్రంగా కడుక్కొని ఒక బౌల్ లోకి చికెన్ తీసుకొని హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు ఒక టీ స్పూన్ సగంచెక్క నిమ్మకాయ రసం వేసి బాగా కలిపి అరగంటసేపు పక్కన పెట్టుకోవాలి. మసాలా కోసం.. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచి 2in దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, మూడు యాలకులు, మూడు లవంగాలు, ఏడు ఎండుమిర్చి, దోరగా వేయించుకోవాలి.
ఆ తర్వాత మసాలా దినుసులు చల్లారాక మిక్సీ జార్ లో మెత్తటి పొడిగా అయిన తర్వాత 20 వెల్లుల్లి రెబ్బలు వేసి గ్రైండ్ చేయాలి ఈ పేస్ట్ ను పక్కన పెట్టుకోవాలి. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి నాలుగు టేబుల్ స్పూన్ నూనె వేసి నూనె వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా మ్యాగ్నెట్ చేసిన చికెన్ వేసి కలుపుకోవాలి. ఐ ఫ్లేమ్ లో ఉంచి రెండు నిమిషాలు చికెన్ వేగనివ్వాలి.
Simple Garlic Chicken Fry : గార్లిక్ చికెన్ ఫ్రై.. :
మీడియం ఫ్లేమ్ లో ఉంచి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ చికెన్ లో ఉన్న వాటర్ అంత పోయి నూనె పైకి తేలేంతవరకు చికెన్ ముక్క ఉడికేంతవరకు (15 నిమిషాలు) వేయించుకోవాలి. ఆ తర్వాత మూత పక్కన పెట్టేసి చికెన్ ఫ్రై ని ఒక్కసారి కలిపి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని చికెన్ బాగా ఫ్రై అయిన నూనె పైకి వచ్చిన తర్వాతే ముందుగా తయారు చేసుకున్న మసాలా పేస్ట్ వేసి చికెన్ ముక్కలకు పట్టేలా కలుపుకోవాలి.
రెండు నిమిషాల తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు నాలుగు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి మరో రెండు నిమిషాలు ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి.. అంటే ఎంతో రుచికరమైన స్పైసి స్పైసి వెల్లుల్లి కారం చికెన్ ఫ్రై రెడీ..