Beans Fry Recipe : ఈ వంటిల్లు ఈరోజు మనం బీన్స్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఈ ఫ్రై మనకు పప్పు రసం సాంబార్ లోకి బాగుంటుంది ఇంకా అన్నంలో కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది చేసుకోవడం కూడా చాలా ఈజీ చాలా త్వరగా అయిపోతుంది ముందుగా అరకిలో బీన్స్ ను కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. బీన్స్ నో ఇలా చిన్న చిన్న ముక్కలుగానే కాకుండా మీకు నచ్చిన విధంగా మీరు ఎలా అయినా కట్ చేసుకోవచ్చు తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని బరకగా మిక్సీ వేసుకోవాలి. మరీ మెత్తగా వేసుకోకూడదు కొంచెం బరకగానే మిక్సీ వేసుకోవాలి.
కొబ్బరిని ఈ విధంగా మిక్సీ వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆవిరి కుడుము పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ముందుగా మనం కట్ చేసుకున్న బీన్స్ వేసుకోవాలి. మీ దగ్గర స్టీమ్ పైన ఉంటే దాంట్లో కూడా మీరు స్టీల్ చేసుకోవచ్చు నీళ్లలో కాకుండా ఈ విధంగా ఆవిరిలో ఉడికించటం వలన బీన్స్ లో ఉండే వైటమిన్స్ అన్ని పోకుండా ఉంటాయి దీనికి వేసుకున్న తర్వాత మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 15 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వాలి 15 నిమిషాల తర్వాత బీన్స్ మనకు ఈ విధంగా ఉడికిపోతాయి ఇలా ఉడికితే సరిపోతుంది ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి.

తాలింపు గింజలు మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆవాలు చిటపటలాడిన తర్వాత అందులో రెండు ఎండు మిరపకాయలు కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి పోపు అంతా వేగిన తర్వాత సన్నగా తరిగిన రెండు ఉల్లిపాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్ లో బాగా వేగనివ్వాలి ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత ముందుగా మనం ఉడికించిన బీన్స్ టెస్ట్ కి తగినంత ఉప్పు వేసుకొని ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత బీన్స్ మనకు ఈ విధంగా వేగిపోతాయి ఇప్పుడు నాలుగు దంచిన వెల్లుల్లి రెబ్బలు హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ముందుగా మనం మిక్సీ వేసుకున్న పచ్చి కొబ్బరి తురుము వేసుకొని బాగా కలుపుకోవాలి
బీన్స్ ను మీడియం ఫ్లేమ్ లో మరో రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై మనకు దశల్ సాంబార్ లోకి కాకుండా అన్నంలోకి కలుపుకొని తినడానికి బాగుంటుంది ఇంకా చపాతీలోకి కూడా బాగుంటుంది రెండు నిమిషాల తర్వాత కొబ్బరి కూడా బాగా కలిసిపోయి ఈ విధంగా రెడీ అవుతుంది ఇప్పుడు లాస్ట్ లో ఒక టీ స్పూన్ పుట్నాల పప్పు పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ పొడి వేసుకోవడం వల్ల ఫ్రైకి మంచి టేస్ట్ వస్తుంది రైస్ చపాతీ లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై రెడీ..





