Andhra Chicken Gravy Recipe : ఆంధ్రా స్టైల్ చికెన్ కర్రీ.. ఈ కోడి కూరను ఇలా గ్రేవీతో చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది.. ఓసారి మీరూ ట్రై చేయండి!

Andhra Chicken Gravy Recipe : నాన్ వెజ్ ప్రియులకు చికెన్ అంటే చాలు.. నోరూరిపోతుంటుంది. చాలామంది తమ ఇంట్లో రకరకాలుగా చికెన్ వంటకాలను తయారుచేసుకుంటారు. చికెన్ ఎలా చేస్తే ఆ రుచి కూడా అలానే ఉంటుంది. అందులోనూ ఆంధ్ర స్పెషల్ కోడి కూర అంటే.. ఆ టేస్టే వేరబ్బా అన్నట్టుగా ఉంటుంది. చికెన్ రుచిగా వండేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ, అన్నిసార్లు కోడి కూర అనుకున్నట్టుగా రాకపోవచ్చు. చికెన్ కూరలో ఏ ఒక్కటి తక్కువ అయినా ఆ టేస్ట్ రాదు.. చికెన్‌లో  కారం, ఉప్పు మసాలా కొలతల ప్రకారం ఇలా వేసి ఒకసారి ట్రై చేసి చూడండి. చికెన్ చక్కటి గ్రేవీతో రుచికరంగా ఉంటుంది. గారెలు, చిల్లి గారెలు, చపాతి, పరోట, జొన్న రొట్టె, రాగి సంకటి, వేడి వేడి అన్నం, పలావ్, బగారా అన్నం, ఈ కూరతో తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఆంధ్ర స్టయిల్లో కోడి కూరను అద్భుతమైన రుచితో ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

కావలసిన పదార్థాలు.. చికెన్-2 కేజీ, పసుపు-2 టేబుల్ స్పూన్, కారం- ఉప్పు( రుచికి తగినంత), నూనె, అల్లం-50 గ్రాములు, వెల్లుల్లి-50 గ్రాములు, జిలకర-1 టీ స్పూన్, ధనియాలపొడి -1టీ స్పూన్, బిర్యానీ ఆకులు-3, లవంగాలు- 4, దాల్చిన చెక్క-2 ఇంచులు, యాలకులు-2, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపాయ (పెద్దవి) -4, పచ్చిమిర్చి-8, కరివేపాకురెండు రెమ్మలు..

తయారీ విధానం…. మిక్సీ జార్ తీసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జిలకర, బిర్యానీ ఆకులు, కచ్చాపచ్చాగా పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవాలి. చికెన్ శుభ్రంగా కడిగి నీళ్లనేవి లేకుండా చూసుకొని పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చికెన్ కర్రీ కి సరిపోయే మందపాటి గిన్నెను పెట్టుకొని నూనె వేయాలి. కూరలో నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది చూసుకొని వేసుకోండి.

andhra chicken gravy recipe in telugu
andhra chicken gravy recipe in telugu

నూనె వేడి అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత చికెన్ వేసి కలపాలి చికెన్ లో ఉన్న వాటర్ ఉడుకుతుంది. కొంచెం చికెన్ మగ్గేంతవరకు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత రుచికి తగినంత కారం ఉప్పు వేసి కలపాలి. మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించాలి కూర అడుగంటకుండా చూసుకోవాలి.

గ్రేవీకి సరిపోయే అన్ని నీళ్లు పోసుకుని కలుపుకొని మూత పెట్టి( ఐదు నిమిషాలు) ఉడికించి.. కూరలో నూనె పైకి తేలేంతవరకు గ్రేవీ వచ్చేంతవరకు ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ లో ఉంచుకోవాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా దంచిన గరం మసాలా పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి మసాలా వేసి కలుపుకోవాలి. కూరకి మసాలా పడుతుంది కాబట్టి మరో రెండు నిమిషాలు ఉడికించాలి. ఆ తర్వాత కొత్తిమీర, పుదీనా చల్లి.. రెండు రెమ్మల కరివేపాకు వేసి కలపాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఎంతో రుచికరమైన ఆంధ్ర కోడి కూర రెడీ..

Read Also : Chicken Keema Pakoda Recipe : నోరూరించే చికెన్ కీమా పకోడీ.. హోటల్ స్టయిల్లో కరకరలాడేలా క్రిస్పీగా ఉండాలంటే ఇలా చేసుకోండి..!

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment