Fish Fry Recipe : చేపలు ఇష్టంలేనివాళ్ళకి కూడా నచ్చేలా పప్పుచారు సాంబార్ తో నంజుకోవడానికి స్నాక్ లా తినడానికి..

 Fish Fry Recipe : చేపలు ఇష్టంలేనివాళ్ళకి కూడా నచ్చేలా పప్పుచారు సాంబార్ తో నంజుకోవడానికి స్నాక్ లా తినడానికి..

కావలసిన పదార్థాలు…చేపలు, ఉప్పు1 స్పూను, కారం 1 స్పూను, కాశ్మీరీ కారం 1 స్పూను, పసుపు 1/3 స్పూన్, మిరియాల పొడి 1 స్పూను, ధనియాల పొడి 2 స్పూను, జీలకర్ర పొడి 1 స్పూను, కాన్ ఫ్లోర్ 2 స్పూను, బియ్యం పిండి 1 స్పూను,అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, నిమ్మరసం, పచ్చిమిర్చి,గరం మసాలా 1 స్పూను..

తయారీ విధానం.. ముందుగా ప్లేట్లో ఒక స్పూను ఉప్పు ఒక స్పూన్ కారం మంచి కలర్ కోసం కాశ్మీరీ కారం ఒక స్పూను పావు స్పూన్ పసుపు, ఒక స్పూన్ మిరియాల పొడి, రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి రెండు స్పూన్ల కాన్ ఫ్లోర్ ఒక స్పూన్ బియ్యం పిండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అరచక్క నిమ్మరసం కూడా వేసి కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చేపల వేపుడు ఎక్కువ స్పైసీగా ఉంటే ఇష్టపడేవాళ్లు మెత్తగా నూరిన పచ్చిమిర్చిల పేస్ట్ కూడా కొద్దిగా వేసుకోవచ్చు వీటితో పాటు గరం మసాలా కూడా ఒక స్పూను వేసుకొని అన్ని బాగా కలిపి ఈ మసాలాని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ స్టేజ్లో ఉప్పు, కారం పులుపు లాంటివని అడ్జస్ట్ చేసుకోవచ్చు

Fish Fry Recipe _ crispy fish fry recipe in telugu
Fish Fry Recipe _ crispy fish fry recipe in telugu

తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసి చాలా పల్చగా కట్ చేయించిన చేప ముక్కల్ని తీసుకొని ఈ మసాలా అంతా వీటికి బాగా పట్టించాలి అయితే చాప ముక్కలకి తడి లేకుండా నీళ్ళని పూర్తిగా వాడ్చేసిన తర్వాత మసాలా పెట్టుకున్నట్లైతే మసాలా బాగా పట్టుకుంటుంది మొక్కలన్నిటికీ రెండు వైపులా మసాలా బాగా పట్టించిన తర్వాత ఐదారు పచ్చిమిర్చిలను కూడా తీసుకొని గాట్లు పెట్టి వీటికి కూడా కొద్దిగా మసాలా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా వీటికి బాగా పట్టడం కోసం అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తే పాన్ లో చేప ముక్కలు మునిగేంత నూనె వేసి నూనె కాగిన తర్వాత చాప ముక్కల్ని వేసుకోవాలి. నూనె సరిగా కాకముందే చేప ముక్కలు వేసినట్లయితే ఈ మసాలా అంతా నూనెలో విడిపోయే అవకాశం ఉంటుంది

ఇప్పుడు మంట మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇవి నూనెలో బిక్స్ కొని కొద్దిగా వేగిన తర్వాత మాత్రమే రెండో వైపు తిరిగేయాలి ఇవి నూనెలో సెట్ అవ్వకముందే మనం గరిటతో తిప్పినట్లైతే మసాలా అంతా నూనెలో విడిపోతుంది ఇక్కడ రెస్టారెంట్ స్టైల్ లో చేయడం కోసం డీప్ ఫ్రై చేస్తున్నాం కానీ లేదంటే అట్ల పెనం మీద తక్కువ నూనెతో కూడా వేయించుకోవచ్చు ఇవి క్రిస్పీగా చక్కగా వేగిన తర్వాత చివర్లో గాట్లు పెట్టుకున్న పచ్చిమిర్చిలు, కరివేపాకు కూడా వేసి వేగిన తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇవి వేయించిన తర్వాత ఈ నూనెని నాన్ వెజ్ కూరల్లో వాడుకోవచ్చు పచ్చిమిర్చిలకు గాట్లు పెట్టకుండా నూనెలో వేసినట్లయితే నూనెలో పేలి నూనె మీద పడే అవకాశం ఉంటుందని గుర్తుంచుకోవాలి . పప్పుచారు సాంబార్ లోకి క్రిస్పీగా ఎంతో రుచిగా ఉండే చేపలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఎంత ఇష్టంగా తినే సింపుల్గా ఈజీగా చేసుకోగలిగే ఈ చేపల వేపుడు..

Read Also :  Fish Curry Recipe : చేప‌ల పులుసు ఎంతో రుచిగా చిక్క‌గా రావాలంటే.. ఇలా ట్రై చేయండి.. కొంచెం కూడా వదిలిపెట్టరు..!

Leave a Comment