Basic Precautions for Yoga : ప్రపంచానికి భారతదేశం అందించిన దివ్యఔషధం యోగా. జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా అందరు యోగా దినోత్సవం జరుపుకుంటారన్న సంగతి అందరికీ విదితమే. జీవన గమనాన్ని మార్చి శారీరక, మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది యోగా. అయితే, యోగాను సరైన నియమ నిబంధనలతోనే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తేనే శారీరకంగా, మానసికంగా దృఢత్వం లభిస్తుంది. యోగాసనాలు వేసే ముందర ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి.. అనే విషయాలు తెలుసుకుందాం.
కఠినమైన ఆసనాలు వేయొద్దు :
యోగాసనాలు స్టార్ట్ చేసే క్రమంలో తొలుతనే కఠినమైన ఆసనాల జోలికి అస్సలు పోవద్దు. ప్రారంభంలో కొంచెం ఈజీ యోగాసనాలు వేయడం మంచిది. అతి కష్టమైన ఆసనాలను సార్టింగ్‌లోనే చేయడానికి ప్రయత్నిస్తే యోగాసనాలు వియడం కష్టంగా మారి మీరు వాటికి దూరమయ్యే చాన్సెస్ ఉంటాయి. కాబట్టి యోగాసనాలను మెల్లగా వేయడం నేర్చుకోవాలి. ఇకపోతే యోగాసనాలు చేయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కనీసం 45 రోజుల వరకు ఈజీ ఆసనాలు వేయడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా మీకు యోగాసనాలపైన ఇంట్రెస్ట్ కలుగుతుంది. నిపుణుల పర్యవేక్షణలోనే యోగాసనాలు చేయాలి.
తద్వారా వారు మీకు పలు సూచననలు చేస్తుంటారు. యోగా చేస్తున్న క్రమంలో దుస్తుల అమరిక చాలా ముఖ్యం. మరీ బిగుతుగా ఉండే దుస్తులు ధరించొద్దు. అలా అని చెప్పి బాగా లూజ్‌గా ఉండే దుస్తులు ధరించొద్దు. మీకు కంఫర్ట్‌గా ఉండే దుస్తులనే ధరించాలి. ఇక ఏదేని అనారోగ్య సమస్యలు యోగాసనాలు వేసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో మొదటనే కఠినతరమైన ఆసనాలు వేయొద్దు. ముఖ్యంగా గుండె, ఊపిరితిత్తుల సంబంధ సమస్యలున్న వారు కఠినమైన యోగాసనాలు చేయొద్దు.
తినగానే ఆసనాలు వేయొద్దు :
నిపుణుల పర్యవేక్షణలో యోగా ఆసనాలను సాధన చేయాలి. మెల్ల మెల్లగా కఠిన ఆసనాలు వేయాలి తప్ప స్టార్టింగ్ టైంలోనే అస్సలు కఠినమైన ఆసనాలు చేయొద్దని నిపుణులు సూచిస్తున్నారు. యోగసనాలను ఎప్పుడు పడితే అప్పుడు అస్సలు చేయకూడదు. ముఖ్యంగా తినగానే ఆసనాలు చేయొద్దు.. ఫుడ్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే, చాలా మంది యోగాసనాను తమకు ఇష్టం వచ్చినట్లుగా చేస్తుంటారు. కానీ, అలా చేయకూడదు. నిపుణుల పర్యవేక్షణలో లేదా వారి సూచనల ప్రకారంగానే యోగాసనాలు చేయడం మంచిది.
నిపుణుల సూచనల ప్రకారం ఏదైనా ఆహార పదార్థాలు తిన్న రెండు గంటలలోపు యోగా చేయడం అస్సలు మంచిది కాదు. ఇకపోతే యోగా చేసే సమయానికి ముందర బాగా తినకూడదు. అలా అని చెప్పి మరీ తక్కువగా కూడా తినొద్దు. లిమిట్‌గా తిని కొంచెం సేపు గ్యాప్ తీసుకున్న తర్వాత యోగాసనాలు చేస్తే మంచిది. ఆసనాలు వేసే ముందర ఖాళీ కడుపు లేకుండా జాగ్రత్త వహించాలి. తేలికైన ఫుడ్ ఐటమ్స్ తీసుకుని యోగసనాలు చేయాలి.

యోగాసనాలు వేసే ముందర వాటర్ పట్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలి. యోగాసనాలు వేయడానికి ఒక గంట ముందర చిన్న గ్లాసు నీళ్లు మాత్రమే తీసుకోవాలి. ఎక్కువగా నీళ్లు తాగిన తర్వాత యోగాసనాలు అస్సలు చేయరాదు. ఒకవేళ యోగాసనం వేస్తున్న సమయంలో మీకు దాహంగా అనిపిస్తే మాత్రం మధ్యలో గుక్కెడు నీరు తాగడం చేయొచ్చు. కానీ, అంతకంటే ఎక్కువ మాత్రం తీసుకోరాదు. ఇక యోగాసనాలు వేయడం స్టార్ట్ చేసే క్రమంలో తొలుతనే కఠినమైన ఆసనాలు వేయొద్దని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యోగసానం ప్రారంభించే రోజుల్లో ముందుగా ప్రాణాయామం చేయాలి. అలాగే శ్వాస క్రియలు ఆచరించాలి. ఆ తర్వాత ఆసనాలు వేయడం మొదలుపెట్టాలని గుర్తించుకోవాలి.
అనారోగ్యం సమయంలో యోగాసనాలు చేయొద్దు :
ఇలా స్లోగా స్టార్ట్ చేయడం వల్ల మీకు యోగాసనాలపై ఇంట్రెస్ట్ ఇంకా పెరిగే చాన్సెస్ ఉంటాయి. మీకు ఆశించిన స్థాయిలో రిజల్ట్స్ కూడా ఉంటాయి. ప్రాణాయామంలో భాగంగా శ్వాసపై పట్టు సంపాదించగలిగాలి. అలా మీకు మానసికంగా ఉత్తేజం లభించడంతో పాటు శారీరకమైన ఫిట్‌నెస్ కూడా లభిస్తుంది. ఈ నియమాలు క్రమపద్ధతిలో పాటిస్తూ యోగాసనాలు వేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా దృఢత్వం పొందొచ్చు. ఇకపోతే యోగాసనాలు అనారోగ్యంగా ఉన్నప్పుడు చేయకపోవడమే మంచిది. నీరసం, హెడేక్, కోల్డ్ లేదా ఇతర అనారోగ్య సమస్యలు ఉంటే కనుక ఆ సమయంలో యోగాసనాలు వేయకపోవడమే మంచిది.
యోగాసనాల సమయంలో ఫోన్ దూరం పెట్టండి :
ఇకపోతే యోగాసనాలు చేసే టైంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ అన్నిటికీ దూరంగా ఉండాలి. సెల్ ఫోన్ కాని ఐపాడ్ కాని టీవీ కాని దగ్గరలో లేకుండా చూసుకోవాలి. అవి ఉండటం మూలాన మీ కాన్సంట్రేషన్ యోగాసనాల నుంచి వాటి వైపునకు షిఫ్ట్ అయ్యే చాన్సెస్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ యోగాసనాలు చేసే టైంలో మీ సమీప ప్రాంతంలో లేకుండా జాగ్రత్త పడాలి. యోగాసనాలు వేయడానికి సెపరేట్ ప్లేస్ సెలక్ట్ చేసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఆసనాలు వేయొద్దు.
నిశ్శబ్దమైన ప్రదేశంలో ఫ్రీగా ఉండే చోట యోగాసనాలు వేయడం ద్వారానే మీకు మానసిక, శారీరక ప్రశాంతత లభిస్తుంది. యోగాసనాలు వేసేప్పుడు నిపుణుల పర్యవేక్షణ ఉండాలి. స్టార్టింగ్ టైంలో పర్యవేక్షణలో కొద్ది రోజులు చేయాలి. ఆ తర్వాతనే సింగిల్‌గా మీరు యోగాసనాలు చేసుకోవచ్చు. యోగాసనాల ద్వారా కాన్సంట్రేషన్ పెరగడంతో పాటు మెమొరీ పవర్ బాగా ఇంక్రీజ్ అవుతుంది. భావోద్వేగాలు కంట్రోల్‌లో ఉంటాయి. ఆరోగ్యంగా ఉండేందుకు ప్రతీ రోజు యోగాసనాలు చేయాలి. యోగాసనాల ద్వారా ఇమ్యూనిటీ పవర్ కూడా ఇంక్రీజ్ అవుతుంది.